త్రివిక్రమ్ ది కూడా అదే దారి!

Mon 17th Jun 2019 07:54 PM
trivikram,rajamouli,allu arjun,movies  త్రివిక్రమ్ ది కూడా అదే దారి!
Trivikram Follows Rajamouli త్రివిక్రమ్ ది కూడా అదే దారి!
Sponsored links

అవును డైరెక్టర్ త్రివిక్రమ్..దర్శకధీరుడు రాజమౌళిని ఫాలో అవుతున్నాడు. త్రివిక్రమ్, రాజమౌళి పద్దతి ఒకటి ఫాలో అవుతున్నాడు. రాజమౌళి స్టార్స్ ని పెట్టి భారీ రేంజ్ లో సినిమాలు తీస్తాడు కాబట్టి ముందుగానే వర్క్ షాప్ లు, రిహార్సల్స్ పెడతాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఎవరైనా రాజమౌళి చెప్పినట్టు వర్క్ షాప్ లకు అటెండ్ కావాల్సిందే. ఆయన చెప్పింది చేయాల్సిందే. ఇప్పుడు అచ్చం అదే పద్దతికి దర్శకుడు త్రివిక్రమ్ కూడా శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. 

త్రివిక్రమ్ లేటెస్ట్ గా తీస్తున్న బన్నీ సినిమాకు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. మూడు నాలుగు రోజుల షాట్ లు అన్నీ ఒకేసారి రెడీ చేసుకుని, వన్ డే వర్క్ షాప్ ఏర్పాటు చేసి, ఫుల్ గా రిహార్సల్ చేయిస్తున్నారట. అలా రిహార్సల్ అయిన నెక్స్ట్ డే నుండి మూడు నాలుగు రోజుల్లో చకచకా షూట్ చేస్తున్నాడట. మళ్లీ మరో రోజు ఓన్లీ రిహార్సల్ చేసి, మూడు నాలుగు రోజులు షూట్ కు వెళ్తారన్నమాట. అటు బన్నీ కూడా ఏం మాట్లాడకుండా త్రివిక్రమ్ చెప్పింది చేస్తున్నాడట. బన్నీనే చేస్తున్నప్పుడు మిగిలిన ఆర్టిస్టులు నో చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి వారు కూడా ఓకే అంటున్నారు. మరి ఇలా చేయడం వల్ల షూటింగ్ లేట్ అవుతుంది కదా? కాల్ షీట్ లు పెరిగిపోతాయి కదా? ఏమో త్రివిక్రమ్ అవుట్ ఫుట్ ఏం కాంప్రమైజ్ కాకూడదని ఇలా చేస్తున్నాడేమో.. ఏం చేసినా సినిమా హిట్ అవ్వడం కోసమేగా.

Sponsored links

Trivikram Follows Rajamouli:

Trivikram, Allu Arjun Movie Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019