శివాజీరాజా తనయుడు ‘జెమ్’ అంట!

Sun 16th Jun 2019 03:01 PM
sivajiraja,vijayaraja,jem movie  శివాజీరాజా తనయుడు ‘జెమ్’ అంట!
Jem Movie Launched శివాజీరాజా తనయుడు ‘జెమ్’ అంట!
Sponsored links

శివాజీరాజా తనయుడు విజయరాజా హీరోగా ‘జెమ్’ చిత్రం ప్రారంభం

శివాజీరాజా తనయుడు హీరోగా మహాలక్ష్మీ మూవీ మేకర్స్ ‘జెమ్’ మూవీని ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి సినీ రంగ ప్రముఖులు హాజరై టీం కి శుభాకాంక్షలు తెలిపారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించే

ఈ మూవీతో సుశీల  సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజయకి జంటగా రాశి సింగ్ నటిస్తుంది. పత్తికొండ కుమార స్వామి నిర్మాణంలో రూపొందబోయే ఈమూవీ ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో ఘనంగా

జరిగింది. ముఖ్యఅతిథులుగా సి. కల్యాణ్, అజయ్, యస్. వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, నటుడు అజయ్, ఉత్తేజ్, సంపూర్ణేష్ బాబు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఫ్రారంభ సన్నివేశానికి గౌరవదర్శకత్వం వహించిన యస్. వి. కృష్ణారెడ్డి, స్ర్కిప్ట్ ని దర్శకుడు సుబ్రమణ్యంకి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. క్లాప్ ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఇవ్వగా, కెమెరా స్విచ్ఛాన్ గుంగుల ప్రతాప్ రెడ్డి చేసారు.

ఈ సందర్భంగా హీరో విజయరాజా మాట్లాడుతూ: ‘నన్నుఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, మీడియా వారికి కృతజ్ఞతలు. యాక్షన్ ఓరియంటడ్ గా సినిమా రూపొందుతుంది. జులై రెండో వారంలో షూటింగ్ కి వెళుతున్నాం. తప్పకుండా అందరినీ మెచ్చుకునే సినిమాగా రూపొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

హీరోయిన్ రాశి సింగ్  మాట్లాడుతూ: ‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. విజయ్ తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు సుబ్రమణ్యం నా పాత్రను చాలా బాగా డిజైన్ చేసారు. ప్రేమకథకు చాలామంచి

స్కోప్ ఉంది. నన్నుతెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే ఆశిస్తున్నాను’ అన్నారు.

దర్శకుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ: ‘యేడాదిన్నరగా ఈ స్టోరీ పై వర్క్ చేసాం. కథ సంతృప్తిగా రాగానే సినిమాని

ప్రారంభించాం. విజయ్ యాక్షన్ హీరోగా ఈ కథకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతున్నాడు. జులై రెండో వారంలో షూటింగ్ మొదలవుతుంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే ప్రారంభం అవుతుంది’ అన్నారు.

నిర్మాత పత్తికొండ కుమార స్వామి మాట్లాడుతూ: ‘ఈకథ నన్ను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు సుబ్రమణ్యం ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తాడనే విశ్వాసం నాకుంది. విజయరాజా ఈ సినిమాతో యూత్ కి దగ్గరవుతాడనే నమ్మకం నాకుంది. ’అన్నారు.

శివాజీ రాజా మాట్లాడుతూ: ‘ఈ సినిమా  ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలకు నా కృతజ్ఞతలు, దర్శకుడు సుబ్రమణ్యం మంచి కథను రెడీ చేసుకున్నాడు. పత్తకొండ కుమారస్వామి గారు మంచి టెక్నీషన్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమాలో ఒక పాటను కృష్ణవంశీ చిత్రీకరిస్తున్నారు. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది’ అన్నారు.

నటీ నటులు: 

హీరో: విజయరాజా, హీరోయిన్, : రాశీ సింగ్ , మరో  హీరోయిన్ : సోనార్, అలోక్

జైన్, అజయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:

కాస్టూమ్స్: శ్రీనివాస్, మేకప్: రంజీత్, పబ్లిసిటీ డిజైనర్: లెనిన్ బాబు, పిఆర్వో: జియస్ కె మీడియా, ఆర్ట్ డైరెక్టర్: బాలకృష్ణ, కొరియోగ్రాఫర్: భాను, యాష్, మ్యూజిక్, డైరెక్టర్: సునీల్ క్యశప్, సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ప్రొడ్యూసర్:

పత్తికొండ కుమారస్వామి, దర్వకుడు : సుశీల సుబ్రమణ్యం

Sponsored links

Jem Movie Launched:

Jem Movie Launche Details

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019