హీరో సందీప్ కిష‌న్‌కి గాయాలు

Sun 16th Jun 2019 12:39 AM
sundeep kishan,major accident,tenali ramakrishna,shooting  హీరో సందీప్ కిష‌న్‌కి గాయాలు
Accident to Hero Sundeep kishan హీరో సందీప్ కిష‌న్‌కి గాయాలు
Sponsored links

సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘తెనాలి రామకృష్ణ’. కర్నూలులో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఫైట్ మాస్టర్ చేసిన తప్పిదం వల్ల హీరోకి గాయాలు అయ్యాయి. ఫైట్‌లో భాగంగా బాంబ్ బ్లాస్ట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ తప్పిదంతో సందీప్ కిషన్ ఛాతీ, కుడి చేతిపై గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే కర్నూలు మై క్యూర్‌ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. అది పూర్తయిన అనంతరం హైదరాబాద్ అపోలో హాస్ప‌ట‌ల్‌కి తీసుకువ‌స్తారు. 

సందీప్ కిషన్ హీరోగా నటించిన మరో సినిమా ‘నిను వీడని నీడను నేనే’ జూలై 12న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. ఇప్పటికే విడుదలైన సినిమా టైటిల్ సాంగ్, ప్రచార చిత్రాలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. హీరోగా, తొలిసారి నిర్మాతగా చేసిన సినిమా విడుదలకు ముందు ఇలా గాయాలు కావడం బాధాకరం.

Sponsored links

Accident to Hero Sundeep kishan:

Major Accident in Tenali Ramakrishna Shooting

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019