జూన్ 28న పోటీ గట్టిగానే ఉంది!!

Wed 12th Jun 2019 05:13 PM
sree vishnu,nivetha thomas brochevarevarura,release date  జూన్ 28న పోటీ గట్టిగానే ఉంది!!
Brochevarevarura gets a release date జూన్ 28న పోటీ గట్టిగానే ఉంది!!
Sponsored links

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో చిత్రం `బ్రోచేవారెవ‌రురా` కావ‌డం గ‌మ‌నార్హం. `చ‌ల‌న‌మే చిత్ర‌ము... చిత్ర‌మే చ‌ల‌న‌ము` అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. క్రియేటివ్ నెరేష‌న్‌ను, ఆర్టిస్టిక్ అంశాల‌కు జ‌నాలు ఫిదా అవుతున్నారు. స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ స‌పోర్టింగ్ రోల్స్ చేశారు. వివేక్ సాగ‌ర్ స్వ‌రాలందించారు. 

ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ కుమార్ మ‌న్యం నిర్మిస్తున్నారు.`బ్రోచేవారెవ‌రురా` ట్రైల‌ర్, ఆడియో విడుద‌ల గురించి త్వ‌ర‌లోనే నిర్మాత ప్ర‌క‌టించ‌నున్నారు. 

Sponsored links

Brochevarevarura gets a release date:

Sree Vishnu, Nivetha Thomas ‘Brochevarevarura’ Release On June 28th 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019