దిమాక్ ఖరాబ్ చేస్తున్న నభా నటేష్

Tue 11th Jun 2019 04:20 PM
nabha natesh,surprises,glamourous avatar,dimmak kharab  దిమాక్ ఖరాబ్ చేస్తున్న నభా నటేష్
Nabha Natesh New Look దిమాక్ ఖరాబ్ చేస్తున్న నభా నటేష్
Sponsored links

కొన్నాళ్ల క్రితం జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో ఇచ్చిన హాట్ పెర్ఫార్మెన్స్ తో దర్శకేంద్రుడి మన్ననలు అందుకున్న టాలెంటెడ్ & గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్ ఇటీవల విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని దిమాక్ ఖరాబ్ లిరికల్ వీడియోలో కనిపించిన స్టిల్స్ లో గ్లామర్ డోస్ గట్టిగా అద్దానని సూచనలిచ్చింది. రెండ్రోజుల క్రితం విడుదలైన ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం ఇండియావైడ్ 3 వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.

చాలా తక్కువ మంది కథానాయికలు మాత్రమే అందం-అభినయ సామర్ధ్యంతో మెప్పించగలరు. వారిలో నభా పేరు ముందు వరుసలో నిలుస్తుంది. ప్రస్తుతం రవితేజతో డిస్కో రాజా, రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో బిజీగా ఉన్న నభాకు టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె ఇటీవలే డిస్కో రాజా షూట్ లో పాల్గొంది. రవితేజతో కలిసి నటించబోయే ఈసినిమా గురించి నభా చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. ఈ సినిమాలో రవితేజతో కలిసి ఆమె నటించబోయే కామెడీ సీన్స్ కోసం నభా వెయిట్ చేస్తోంది.

నభా కామెడీ టైమింగ్ నన్ను దోచుకోందువటే ట్రైలర్లో చూసినప్పుడు బాగా నచ్చింది. అందుకే ఆ సినిమా విడుదలకు ముందే ఆమెను డిస్కో రాజా సినిమా కోసం సైన్ చేసాం అని డిస్కో రాజా టీమ్ మెంబర్ తెలిపారు. నభాతో షూటింగ్ చాలా సరదాగా ఉంటుంది. ఆమె చాలా ఎనర్జిటిక్ & హాక్టివ్. ఆమె ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాలా క్రేజీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పటివరకూ ఈ తరహా పాత్రను తెలుగు ప్రేక్షకులు చూసి ఉండరు అని ఇస్మార్ట్

శంకర్ టీమ్ మేట్ తెలిపారు. ఇప్పుడు అందరి చూపు త్వరలో విడుదల కానున్న ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ మీద ఉంది. మరి లిరికల్ వీడియో స్టిల్స్ తోనే కుర్రాళ్ళ మతులు పోగొట్టిన నభా.. ట్రైలర్ లో ఎలా కనిపించబోతొందో చూద్దాం

Sponsored links

Nabha Natesh New Look:

Nabha Natesh surprises us by her new glamourous avatar in the New Dimmak Kharab lyrical video

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019