బాలయ్య 105 ఆగిపోలేదు..!

Sat 08th Jun 2019 10:59 PM
balayya,ks ravikumar,nbk 105,c kalyan,ysr family,balakrishna  బాలయ్య 105 ఆగిపోలేదు..!
NBK 105 Movie Details బాలయ్య 105 ఆగిపోలేదు..!
Sponsored links

బాలయ్య వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి విజయమే కాదు.. ఆయనకు దర్శకుడు క్రిష్‌కి మంచి పేరు తీసుకుని వచ్చింది. ఆ వయసులో కూడా బాలయ్య వీరోచిత నటన, అంతటి పీరియాడికల్‌ మూవీని తక్కువ బడ్జెట్‌తో కేవలం 72 రోజులకే పూర్తి చేసిన క్రిష్‌ని అందరూ ఆకాశానికి ఎత్తారు. ఇక ఆ తర్వాత ఆయన పూరీ జగన్నాథ్‌తో ‘పైసావసూల్‌’, కె.యస్‌. రవికుమార్‌తో ‘జైసింహా’, క్రిష్‌ దర్శకత్వంలో ‘కథానాయకుడు, మహానాయకుడు’ వంటి చిత్రాలు చేశాడు. బాలయ్య 100వ చిత్రంతో పాటు చిరు తన 150వ చిత్రం చేసినా ఇప్పటికీ 151 పూర్తి కాకపోవడం చూస్తే బాలయ్య జోరు తెలుస్తుంది. 

కాగా బాలకృష్ణ తన 105వ చిత్రంగా మరలా ‘జైసింహా’ దర్శకుడు, తమిళ సీనియర్‌ డైరెక్టర్‌ కె.యస్‌.రవికుమార్‌కే అప్పగించాడు. నిర్మాత కూడా ఆ సినిమా నిర్మాతే సి.కళ్యాణ్‌. మొదట ఈ చిత్రం ఎన్నికలకు ముందే ప్రారంభం అవుతుందని భావించారు. కానీ వీలుకాలేదు. ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. ఈ చిత్ర కథ ప్రకారం పొలిటికల్‌ నేపధ్యం ఉండే స్టోరీ అట. టిడిపికి వ్యతిరేక పార్టీలకి చెందిన వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌లను ఇందులో విలన్లుగా చూపించనున్నారని, కానీ వైసీపీ ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈ చిత్రాన్ని మిడిల్‌ డ్రాప్‌ చేశారని వార్తలు వచ్చాయి. 

కానీ ప్రస్తుతం ఇందులో వచ్చే డైలాగ్స్‌,, కొన్ని సీన్స్‌ని మరలా రీరైట్‌ చేయించారట. కాగా ఈ చిత్రాన్ని ఈనెల 12న ప్రారంభించి, వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఎన్బీకే105 ప్రారంభం కానుండటం నందమూరి అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయమేనని చెప్పాలి....! 

Sponsored links

NBK 105 Movie Details :

Balayya and KS Ravikumar Movie Starts From June 12th

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019