‘నేనే కేడీ నెం-1’ సెన్సార్‌కు రెడీ!

Sat 08th Jun 2019 07:16 PM
shakalaka shankar,nene kedi no 1,movie,latest,update  ‘నేనే కేడీ నెం-1’ సెన్సార్‌కు రెడీ!
Nene Kedi No 1 Movie Latest Update ‘నేనే కేడీ నెం-1’ సెన్సార్‌కు రెడీ!
Sponsored links

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘నేనే కేడీ నెం‘1’.  ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై  ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ముస్కాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్  కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం సెన్సార్ ప‌నులు జ‌రుపుకుంటోంది. జూన్ చివ‌రి వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ  సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత జాని మాట్లాడుతూ...‘‘మంచి ఎంట‌ర్‌టైన్ తో వ‌స్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘నేనే కేడీ నెం‘1’. ప్ర‌స్తుత స‌మాజంలో పిల్ల‌లు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌ల‌వుతున్నారంటే దానికి కార‌ణం త‌ల్లిదండ్రులు కూడా. నేటి బిజీ లైఫ్ లో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను  ప‌ట్టించుకోకుండా, బాధ్య‌త‌లు తెల‌ప‌కుండా  పూర్తి స్వేచ్ఛ‌నిస్తూ గాలికి  వ‌దిలేస్తున్నారు. ఈ క్ర‌మంలో యువ‌త పెడ‌దోవ ప‌డుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించాం. త‌ప్ప‌కుండా ప్రతి త‌ల్లి, తండ్రితో పాటు పిల్ల‌లు చూడాల్సిన సినిమా ఇది.  ష‌క‌ల‌క శంక‌ర్ లోని మ‌రోకోణం మా సినిమాలో చూపించాం. ఆడియ‌న్స్ కు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ జోడించాం. హీరోయిన్ గా ముస్కాన్ అందం, అభిన‌యం  అలాగే ముకుల్ దేవ్, పృథ్వీ పాత్ర‌లు సినిమాకు  స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తాయి.  ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. జూన్ చివ‌రి వారంలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

ముకుల్ దేవ్, పృథ్వీ, పూజా, పి.డి.రాజు, క‌రాటే క‌ళ్యాణి, రాం జ‌గ‌న్, రాజేంద‌ర్, నాగ మ‌హేష్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి  సంగీతం: అజ‌య్ ప‌ట్నాయ‌క్‌, కెమెరా: శ్రావ‌ణ్ కుమార్, ఎడిట‌ర్: స‌ములేటి శ్రీనివాస్, స్టోరీ - స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం- నిర్మాత: జాని

Sponsored links

Nene Kedi No 1 Movie Latest Update:

Nene Kedi no 1 Movie Ready to Censor

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019