‘దొరసాని’ టీజర్ ఎలా ఉందంటే?

Fri 07th Jun 2019 02:55 PM
anand deverakonda,shivathmika,dorasani,movie,teaser,release  ‘దొరసాని’ టీజర్ ఎలా ఉందంటే?
Dorasani Teaser Review ‘దొరసాని’ టీజర్ ఎలా ఉందంటే?
Sponsored links

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తొలి చిత్రం, యాంగ్రీ హీరో రాజశేఖర్ రెండో అమ్మాయి శివాత్మిక డెబ్యూ మూవీగా రూపొందిన చిత్రం దొరసాని యొక్క టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. ఇందులో రాజుగాడు(విజయ్ దేవరకొండ)తన స్నేహితులతో కలిసి రోజులు గడుపుతూ ఉంటాడు. తొలి చూపుతోనే ఓ పెద్దింటి అమ్మాయిని దేవకీ(శివాత్మిక) పై మనసు పారేసుకుంటాడు.

ఆమెను ఫాలో అవుతున్న తరణంలో ఆమె కూడా ఈ కుర్రోడి ప్రేమలో పడుతుంది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరిని ఒకరు వదిలి ఉండలేని స్థితికి వస్తారు. విషయం బయటపడుతుంది. రాజు ప్రాణాల మీదకు వస్తుంది. మరి ఆ తరువాత ఏమైంది అనేది సినిమా.

ఇందులో ఆనంద్ దేవరకొండ లేతగా పల్లెటూరి కుర్రాడిగా ఒదిగిపోయాడు. అలానే శివాత్మిక లుక్స్ లో దొరసానిని తలపించింది. టీజర్ లో మంచి నేటివిటీ ఫీల్ కలిగించారు. స్టోరీ లైన్ పాతది అయినప్పటికీ ట్రీట్ మెంట్ పరంగా చూపించిన ఫ్రెష్ నెస్ కనెక్ట్ అయ్యేలా అనిపిస్తోంది.  కెవిఅర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు. సురేష్ బాబు-యష్ రంగినేని-మధుర శ్రీధర్ సంయుక్తంగా ఈమూవీని నిర్మించారు.

Click Here For Teaser

Sponsored links

Dorasani Teaser Review:

Dorasani Teaser Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019