Advertisementt

రామానాయుడుకు అంకితమిచ్చారు

Fri 07th Jun 2019 12:35 PM
naga chaitanya,suresh babu,ramanaidu,birth anniversary,special,venkymama,social media  రామానాయుడుకు అంకితమిచ్చారు
Chiatu and Suresh Babu Emotional Tweets on Ramanaidu రామానాయుడుకు అంకితమిచ్చారు
Advertisement
Ads by CJ
రామానాయుడు ఈ పేరు వింటే మనకి బ్లాక్ బస్టర్స్ చిత్రాలు, సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి. అలానే ఇతని పేరు మీద నిర్మితమైన రామానాయుడు స్టూడియోస్ కూడా గుర్తుకు వస్తుంది. అయితే ఈరోజు రామానాయుడు జయంతి సందర్భంగా తన తాతకి “వెంకీ మామ” మూవీని అంకితమిస్తున్నట్లుగా చైతు, నిర్మాత సురేష్ బాబు ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు.
వెంకీమామ మూవీకి సంబంధించి ఓ పోస్టర్ పోస్ట్ చేసి ‘‘ఇదంతా మీకోసమే  తాతయ్య” అని సందేశం రాసాడు చైతు. ఆ పోస్టర్ పైనే “మనువడు, కొడుకు ఒకే మూవీలో సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్నది మీ కల, అది నిజమయ్యే నాటికి మీరు మాకు దూరంగా వెళ్లిపోయారు” అంటూ సురేష్ బాబు సందేశం ఆ పోస్టర్ పై ఉంది.
ఇలా ఇద్దరు తమ అభిప్రాయాల్ని ఎమోషనల్ గా చెప్పారు. రామానాయుడు 1936 జూన్ 6న జన్మించి... ఫిబ్రవరి 18, 2015 లో కన్నుమూశారు. ఇక వెంకీమామ చిత్రం యొక్క టీజర్ త్వరలోనే రిలీజ్ కానుంది.

Chiatu and Suresh Babu Emotional Tweets on Ramanaidu:

Ramanaidu Birth Anniversary Special

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ