Advertisement

‘కిల్లర్’ విడుదలకు అన్నీ సిద్ధం

Sun 02nd Jun 2019 11:20 AM
hero arjun,vijay antony,killer movie,release,june 7  ‘కిల్లర్’ విడుదలకు అన్నీ సిద్ధం
Ready to Release: Killer ‘కిల్లర్’ విడుదలకు అన్నీ సిద్ధం
Advertisement

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.  అషిమా క‌థానాయిక‌గా నటిస్తుంది.  సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి మాక్స్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా విజయ్ ఆంటోనీ, అర్జున్ ల కలయికతో వస్తున్న ఈ సినిమాకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ పొందగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రంజాన్ కానుకగా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. యాక్ష‌న్ కింగ్ అర్జున్, హీరో విజయ్ ఆంటోనీలు నటించిన కిల్లర్ చిత్రానికి తెలుగులో మంచి బిజినెస్ జరిగింది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  సెన్సార్ పూర్తయ్యింది. జూన్ 7 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. అన్నారు.

నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్ 

సాంకేతిక నిపుణులు : 

రచయిత & దర్శకుడు: ఆండ్రూ లూయిస్

నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్

బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌

సంగీతం: సైమన్ కే కింగ్

సాహిత్యం మరియు సంభాషణలు: భాష్యశ్రీ

సినిమాటోగ్రఫీ: మాక్స్

ఎడిటర్: రిచర్డ్ కెవిన్

ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్

పి.ఆర్.ఓ: సాయి సతీష్

Ready to Release: Killer:

Killer Movie Release on June 7th

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement