Advertisementt

కాజల్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచేసిందిగా..!

Tue 28th May 2019 02:40 PM
kajal agarwal,kavacham,sita  కాజల్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచేసిందిగా..!
News About Kajal Agarwal కాజల్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచేసిందిగా..!
Advertisement
Ads by CJ

‘కవచం’ సినిమా అప్పుడు.. ‘సీత’ సినిమా ఇప్పుడు టాప్ అండ్ గ్లామర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ని నమ్ముకుంటే బెల్లంకొండ శ్రీనివాస్‌కి మంచి దెబ్బే పడింది. కాజల్ టాప్ హీరోయిన్ కదా.. తన హీరోయిజాన్ని చూపిస్తూ కాజల్ అందాలను, క్రేజ్‌ని నమ్ముకుంటే చాల్లే అనుకున్న బెల్లంకొండకి బాగా తెలిసొచ్చింది. వరసగా ‘కవచం’, ‘సీత’ సినిమాలు దెబ్బేసాయి. ‘కవచం’ కన్నా ‘సీత’ సినిమా అప్పుడు దర్శకుడు తేజ, నిర్మాత, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా కాజల్‌నే నమ్ముకున్నారు. ఆఖరుకి బయ్యర్లు కూడా కాజల్‌ని చూసే ‘సీత’ సినిమాను కొన్నారు.

కానీ.. సినిమా విడుదలయ్యాక సీన్ సితార అయ్యింది. కాజల్ అందాలు, గ్లామర్, క్రేజ్ ఏమి సీత సినిమాని గట్టెక్కించలేకపోయాయి. సీత సినిమా మొదటి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 4.2 కోట్ల షేర్ వసూలు చేసింది. మరి వీకెండ్ కావడంతో కలెక్షన్స్ పర్వాలేదనిపించింది.... సీత అసలు రంగు  నేడు సోమవారం కానీ బయటపడేలా లేదు. టాక్ కాస్త బావున్నా.. సీత సినిమా ఆడేసేదే. ఎందుకంటే వేసవి సెలవలు చిఎవరిలో విడుదలైన సీత సినిమా కి టాక్ బావుంటే హిట్ అయ్యేదే. కానీ పాజిటివ్ టాక్ పడలేదు. ఇక కాజల్ ని నమ్ముకుని థియేటర్స్ కెళ్లిన ప్రేక్షకులు..... కి చిరాకు పెట్టేలా సినిమా ఉండడంతో.. వారు పెదవి విరుపులతో సీత సినిమా కి బాగా దెబ్బపడింది. మరి ఈ వరస ప్లాప్స్ తో బెల్లంకొండ మాత్రం కాజల్ ని నమ్ముకుంటే.. ఇలా నట్టేట ముంచిందేంటబ్బా అంటూ ఉసూరుమంటున్నాడట.

 

 

 

 

News About Kajal Agarwal:

News About Kajal Agarwal

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ