పాయల్ రాజపుత్‌కు అది కూడా కలిసి రాలేదే!

Sun 26th May 2019 06:36 PM
actor payal rajput,rx100 actress,sita bulreddy song  పాయల్ రాజపుత్‌కు అది కూడా కలిసి రాలేదే!
Bad luck For Payal Rajput పాయల్ రాజపుత్‌కు అది కూడా కలిసి రాలేదే!
Sponsored links

RX 100 బ్యూటీ పాయల్ రాజపుత్‌.. RX 100 హిట్‌తో తెగ బిజీ అవ్వుద్ది అనుకుంటే.. ఎక్కడా పాయల్ పేరు కూడా వినబడలేదు. అదిగో పాయల్ ఇదిగో పాయల్ ఆ సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమాలో నటిస్తుందని రూమర్స్ తప్ప పాయల్ రాజపుత్‌‌కి అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలు లేదు. హాట్ హీరోయిన్‌కి యంగ్ హీరోలు అవకాశమివ్వకపోయినా... సీనియర్ హీరోలు పిలిచి అవకాశాలిస్తున్నారు. ఇప్పటికే వెంకీ మామలో వెంకటేష్ సరసన నటిస్తున్న ఈ హీరోయిన్‌కి మన్మధుడు 2 లో అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది. ఆ అవకాశం రకుల్ తన్నుకుపోయింది. ఇక బాలకృష్ణ సరసన పాయల్ అన్నారు కానీ.. కంఫార్మేషన్ లేదు.

తాజాగా పాయల్ రాజపుట్ స్పెషల్ సాంగ్ చేసిన సీత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీత సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. ఈ సినిమా లో పాయల్ ‘బుల్ రెడ్డి’ అనే స్పెషల్ సాంగ్‌లో గ్లామర్ ఒలకబోస్తూ చిందులేసింది. కానీ సీత సినిమాలో ఆ సాంగ్ ఎందుకు పెట్టారో కూడా అర్ధం కాదు. పాయల్ ఎందుకు ఈ సాంగ్ ఒప్పుకుందో తెలియదు. అధిక పారితోషకం ఇస్తాను అన్నారేమో అందుకే పాయల్ ఆలా టెంప్ట్ అయ్యిందిలే అని సోషల్ మీడియాలో పాయల్‌పై సెటైర్స్ పడుతున్నాయి. ఏదో సీత సినిమా హిట్ అయినా బావుండేది. కాస్తో కూస్తో పాయల్‌కి పేరొచ్చేది. పాపం పాయల్ రాజపుత్‌. కేవలం సీనియర్ హీరోల దృష్టిలో పడుతూ స్పెషల్ సాంగ్స్ అయినా చేసుకుందామంటే.. అది వర్కౌట్ అవలేదు.

Sponsored links

Bad luck For Payal Rajput :

Bad luck For Payal Rajput 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019