బెల్లంకొండ మరీ ఇంత చీపైపోయాడేమిటి!!

Sun 26th May 2019 06:31 PM
sita,kajal,bellamkonda sai  బెల్లంకొండ మరీ ఇంత చీపైపోయాడేమిటి!!
News About Seetha movie Hero Bellamkonda Sai Sreenivas బెల్లంకొండ మరీ ఇంత చీపైపోయాడేమిటి!!
Sponsored links

దర్శకుడు తేజ సీత అనే కథను రాసుకుని.... నేనే రాజు నేనే మంత్రి టైం లో కాజల్ అగర్వాల్ కి ఆ కథని వినిపించగా.... ఆ కథ ని నేనె చేస్తా.. ఎవరికీ చెప్పొద్దని మరీ కాజల్, తేజ తో సీత సినిమా చేసింది. మరి హీరోయిన్‌ని హైలెట్ చేస్తూ హీరోని డమ్మి చేసే సినిమాల్లో నటించేందుకు ఎలాంటి హీరో కూడా ఇంట్రెస్ట్ చూపడు. అలాగే సీత కథను చాలామంది హీరోలు రిజెక్ట్ చేసారంటూ స్వయానా దర్శకుడు తేజనే చెప్పాడు. మరి అలాంటి కథను బెల్లంకొండ ఎలా ఒప్పుకున్నాడో అని చాలామంది పెదవి విరిచారు. మరి నిజంగానే నిన్న విడుదలైన సీత సినిమా చూసిన ఎవ్వరైనా... ఇలాంటి కథని చెయ్యడానికి ఏ హీరో ముందుకు రాడు... కానీ బెల్లంకొండ ఎలా ఒప్పుకున్నాడో అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. మరి సీత కథలో ముందునుంచి అనుకున్నట్టుగా హీరోయిన్ కాజల్ హైలెట్. మరి కనీసం హీరోకి విలన్ కున్న ఇంపార్టెన్స్ కూడా ఈ సినిమాలో లేదు.

 

హీరోయిన్ కాజల్ తో సమానమైన రోల్ సోను సూద్ కొట్టేసాడు. సోను సూద్ విలనిజం ముందు హీరో బెల్లంకొండ తేలిపోయాడు. ఇప్పటివరకు బోలెడంత డబ్బు పోసి హీరోయిజాన్ని చూపించిన బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారి తన హీరోయిజాన్ని పక్కనపడేశాడు. సీత సినిమా చూస్తున్నంత సేపు ఒక బెల్లంకొండ శ్రీనివాస్ డమ్మీగానే కనిపిస్తాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హావభావాలు అతడి నటన చూసి ప్రేక్షకుడికి నవ్వు ఆగదు. మొదట్లో అతడి నటన చాలా ఆడ్ గా మాత్రమే అనిపిస్తుంది. కానీ తర్వాత మాత్రం నవ్వొస్తుంది. ఈ సినిమాలో తన డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్ ల మీద బాగా దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది కానీ... అది వర్కౌట్ అవ్వలేదు. కాజల్ నటన ఆకర్షణ ముందు బెల్లంకొండ పూర్తిగా తేలిపోయాడు. అసలు ఎప్పుడు హీరోయిజం చూపిస్తూ మాస్ గా కనబడే ఈ హీరో మొదటిసారి ఇలా ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర చేసి... అందరిని ఆశ్చర్యపరిచాడు.

Sponsored links

News About Seetha movie Hero Bellamkonda Sai Sreenivas:

News About Seetha movie Hero Bellamkonda Sai Sreenivas

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019