రకుల్ ప్రీత్ బాగానే నేర్చిందండోయ్..!

Sun 26th May 2019 06:28 PM
rakul preet singh,ranveer singh,bollywood,marriage,bollywood chances  రకుల్ ప్రీత్ బాగానే నేర్చిందండోయ్..!
Rakul Preet Singh Praises on Bollywood Hero రకుల్ ప్రీత్ బాగానే నేర్చిందండోయ్..!
Sponsored links

తెలుగులో ఆఫర్స్ లేని రకుల్. కోలీవుడ్ అవకాశాలు కోల్పోతున్న రకుల్. ఇలా రకుల్ ప్రీత్ సింగ్ మీద గత కొన్నాళ్లుగా వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. కానీ రకుల్ ప్రీత్ మాత్రం కూల్ గా బాలీవుడ్ మీద కన్నేసింది. అక్కడ అజయ్ దేవగన్ తో కలిసి నటించిన దే దే ప్యార్ దే మిక్స్డ్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరి అందులో 50  ఏళ్ళ అజేయ దేవగన్ కి రకుల్ ప్రీత్ లవర్ గా నటించింది. రకుల్.. దే దే ప్యార్ దే కలెక్షన్స్ చూసి పిచ్చ హ్యాపీ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. అందుకే ఆ ఉత్సాహంతో దే దే ప్యార్ దే ప్రమోషన్స్ ని సోషల్ మీడియాలో పీక్స్ లో చేస్తుంది.

ఇక బాలీవుడ్ లో దే దే ప్యార్ దే కి వస్తున్న రెస్పాన్స్ చూసిన రకుల్ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఆ ఇంటర్వూస్ లో భాగంగా రకుల్ కి బాలీవుడ్ హీరోయిన్ లో ఎంతో ఇష్టమైన హీరో ఎవరనే ప్రస్తావన రాగానే రకుల్ ఏమాత్రం తడుముకోకుండా రణ్వీర్ సింగ్ పేరు చెప్పేసింది. బాలీవుడ్ లో ఎనర్జి లెవెల్స్ పీక్స్ లో ఉంటాయని... అలాంటి హీరో బాలీవుడ్ లో మరొకరు లేరని.. ఆయనతో కలిసి పని చెయ్యడం ఒక అదృష్టమని..అసలు రణ్వీర్ సింగ్ కి పెళ్ళికాకుండా ఉంటే తానే రణ్వీర్ సింగ్ ని పెళ్లాడే దానిని అని రకుల్ ఎటువంటి మొహమాటాలు పోకుండా చెప్పేసింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న రణ్వీర్ తో కలిసి సినిమా చేయాలంటే ఈ మాత్రం పొగడ్తలు అవసరమని రకుల్ కి బాగా తెలుసు. అందుకే అవకాశం రాగానే రణ్వీర్ పై తనకున్న ఇష్టాన్ని బయట పెట్టింది ఈ భామ.

Sponsored links

Rakul Preet Singh Praises on Bollywood Hero:

Rakul Preet singh Sensational Comments on Ranveer Singh

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019