నా అభిమానులకు నేను చెప్పేది ఇదే: సునీల్

Sun 26th May 2019 06:18 PM
sunil,fans,comedina sunil,sunil fans,actor sunil,tollywood  నా అభిమానులకు నేను చెప్పేది ఇదే: సునీల్
Sunil Takes Good Decision about His Fans నా అభిమానులకు నేను చెప్పేది ఇదే: సునీల్
Sponsored links

కమెడియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తరువాత హీరోగా కూడా చేసి మళ్లీ తిరిగి కమెడియన్ వేషాలు వేయడానికి వచ్చిన సునీల్ ప్రస్తుతం వరస సినిమాలతో మంచి మంచి రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈనేపధ్యంలో ఆయన లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ‌లో కొన్ని మంచి మాటలు చెప్పారు.

సునీల్ మాట్లాడుతూ.. అందరి హీరోల అభిమానులు తన సినిమాలు చూస్తారు. నన్ను ఇష్ట పడతారు. నిజం చెప్పాలంటే ఇది నా అదృష్టం అని చెప్పాలి. ఇలా ఎవరికి ఉండరు. నాకంటూ ప్రత్యేకంగా అభిమాన సంఘాలు లేవు. అయితే గతంలో కొంతమంది వచ్చి మీకు అభిమాన సంఘాలు పెడతామని అన్నారు.

నేను అటువంటివి ఏమి చేయకండి...సమయం చాలా విలువైంది. దాని వేస్ట్ చేయకండి. ఆ సమయం మీ ఫ్యామిలీ కోసం కేటాయించండి. జీవితంలో ఏదైనా సాధించదలచుకుంటే దానిపై దృష్టి పెట్టండి. మీరు మీ పని చేసుకుంటూనే నా సినిమాలు కూడా చూస్తూ ఉండండి. నా మూవీస్ నచ్చితే పదిమందికి చెప్పండి.. అంతేగాని ఇలా నా కోసం మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు .. జీవితంలో తిరిగిరానిది సమయమే అని చెప్పి పంపించాను.. అని తెలిపారు. నా వద్దకు అభిమానులు ఎప్పుడు కలవడానికి వచ్చినా నేను చెప్పేది ఇదే.. అని ఆయన అన్నారు.

Sponsored links

Sunil Takes Good Decision about His Fans:

Sunil Talks About his fans an Interview

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019