అఖిల్ సినిమాకు అల్లు అయాన్ స్విచ్ఛాన్!

Sun 26th May 2019 05:25 PM
akhil 4th film,ga2 pictures,akhil akkineni,allu aravind,ayaan,nagarjuna,bommarillu bhaskar  అఖిల్ సినిమాకు అల్లు అయాన్ స్విచ్ఛాన్!
Akhil 4th Film in Geetha Arts 2 Banner.. Launched అఖిల్ సినిమాకు అల్లు అయాన్ స్విచ్ఛాన్!
Sponsored links

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం 5గా.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మాత‌లు బ‌న్నీవాసు, వాసు వ‌ర్మలు నిర్మాత‌లుగా రూపుదిద్దుకోనున్న చిత్ర పూజాకార్య‌క్ర‌మాలు శుక్రవారం ఫిల్మ్‌న‌గ‌ర్ టెంపుల్‌లో జరిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి కింగ్ నాగార్జున, అమ‌ల, మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ, అల్లు అర‌వింద్ స‌తీమ‌ణి నిర్మ‌ల, ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్, శ్రీకాంత్ అడ్డాల, మారుతి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో కింగ్ నాగార్జున తొలి సన్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా స్టైలిస్‌స్టార్ అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా అల్లు అర‌వింద్ మ‌న‌మరాలు బేబి అన్విత క్లాప్ కొట్టారు.

అఖిల్ అక్కినేని -బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ల కాంబినేష‌న్

అక్కినేని నాగేశ్వ‌రావు, అక్కినేని నాగార్జున న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని త‌న‌ సినిమాల ద్వారా త‌న‌కంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను వంటి ల‌వ్ కమ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలీ అండ్ గ‌ర్ల్స్ సెక్టార్‌లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బొమ్మ‌రిల్లు లాంటి చిత్రం ఇప్ప‌టికీ ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిలిచిపోయిందంటే అందుకు కారణం ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వేల్యూసే. ఆ త‌రువాత వ‌చ్చిన ప‌రుగు చిత్రం ప్ర‌తి ఒక్కరినీ ఆలోచింప‌జేసేలా చేసింది. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌లో భాస్క‌ర్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్ప‌డు వీరిద్దరి కాంబినేష‌న్‌లో చిత్రం అన‌గానే ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది.

100 పర్సంట్ ల‌వ్ త‌రువాత అక్కినేని వార‌సుడు గీతా ఆర్ట్స్‌లో...

గ‌తంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం 100 పర్సంట్ ల‌వ్‌. ఈ చిత్రంలో అక్కినేని న‌ట వార‌సుడు నాగ చైత‌న్య హీరోగా నటించగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మాత బ‌న్ని వాసు నిర్మించాడు. ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించ‌టం విశేషం. మ‌ళ్లీ ఇప్పుడు అక్కినేని వారి మ‌రో న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేనితో నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసు వ‌ర్మ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా 100 పర్సంట్ ల‌వ్‌కి డ‌బుల్ హిట్‌ని సాధిస్తుంద‌ని యూనిట్‌ అంతా కాన్ఫిడెంట్‌ ఉంది.

అల్లు అర‌వింద్-జిఏ2 పిక్చ‌ర్స్‌- బ‌న్నివాసు-వాసువ‌ర్మ కాంబినేష‌న్‌

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ సమర్పణలో బ‌న్ని వాసు ప్రొడ్యూస‌ర్‌గా 100 పర్సంట్ ల‌వ్ నుంచి పిల్లా నువ్వులేని జీవితం, గీతా గోవిందం వ‌ర‌కూ వ‌ర‌స బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు సొంతం చేసుకున్నారు. సెలెక్టెడ్ స్క్రిప్ట్‌ల‌తో అప్‌డేటెడ్‌గా అల్లు అర‌వింద్.. స‌ల‌హ‌లు సూచ‌న‌ల‌తో బ‌న్ని వాసు యువ నిర్మాత‌గా స‌క్సెస్ రేట్ ఎక్కువుగా ఉన్న నిర్మాతలలో ఒకడిగా త‌న‌కంటూ ఓ ప్రత్యేకతని ఏర్ప‌రుచుకున్నాడు. ఇప్ప‌డు ఈ చిత్ర క‌థ న‌చ్చిన మ‌రో యంగ్ ద‌ర్శ‌కుడు వాసు వ‌ర్మ మొట్ట‌మొద‌టిసారిగా నిర్మాణ రంగంలోకి బ‌న్ని వాసుతో క‌లిసి యంగ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని‌తో.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, మ‌రియు షూటింగ్ షెడ్యూల్స్ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం అని నిర్మాత‌లు తెలిపారు..

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌

కెమెరా- వి.మ‌ణికంద‌న్‌

సంగీతం- గోపిసుంద‌ర్‌

ఎడిటింగ్‌- మార్తాండ్‌.కె.వెంక‌టేష్‌

నిర్మాత‌లు.. బ‌న్ని వాసు, వాసు వ‌ర్మ‌

క‌థ‌, స్ర్కీ‌న్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం- భాస్క‌ర్‌

Sponsored links

Akhil 4th Film in Geetha Arts 2 Banner.. Launched:

Akhil 4th Film Launch highlights

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019