‘సువ‌ర్ణ‌సుంద‌రి’ ముస్తాబైంది

Sat 25th May 2019 02:47 AM
suvarna sundari,censor details,ready to release,suvarna sundari movie,jayapradha  ‘సువ‌ర్ణ‌సుంద‌రి’ ముస్తాబైంది
Suvarna Sundari Censor Completed ‘సువ‌ర్ణ‌సుంద‌రి’ ముస్తాబైంది
Sponsored links

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సువ‌ర్ణ‌సుంద‌రి’ మే 31న విడుద‌ల‌

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న క్యాప్షన్‌తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఓ సాంకేతిక అద్భుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని  మే 31న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఈ సందర్బంగా నిర్మాత ల‌క్ష్మీ మాట్లాడుతూ.. సువర్ణ సుందరి చిత్ర సెన్సార్ కంప్లీట్ అయింది. యుబైఎ సర్టిఫికేట్ లభించింది.ఈ నెల 31వ తేదీన తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బ‌డ్జెట్‌ను మించి క్వాలిటి ఔట్ పుట్ రావటం సినిమా సక్సెస్‌పై కాన్పిడెన్స్‌ను పెంచిందన్నారు.

దర్శకుడు ఎం.ఎస్.ఎన్‌. సూర్య మాట్లాడుతూ.. సువర్ణ సుందరి లాంటి కంటెంట్ ఉన్న సినిమాకు నేను డైరెక్ట‌ర్‌గా వర్క్ చేయటం గర్వంగా ఉంది. స్టోరీ డిమాండ్‌కు తగ్గట్టుగా క్వాలిటీ‌తో సినిమాను చేశాం. సెన్సార్ సభ్యులు మా సువర్ణ సుందరి‌ని చూసి టీమ్‌ను అభినందించారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఇందులో ప్రతి పాత్ర కీలకమైనదే అన్నారు.

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్: ఎం.ఎల్‌.ల‌క్ష్మి, మ్యూజిక్‌ డైరెక్ట‌ర్: సాయికార్తిక్‌, స్టంట్స్: రామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్: నాగు, డి.ఓ.పి.: ఎల్లుమహంతి, ఎడిట‌ర్: ప్ర‌వీణ్‌పూడి, స్టోరీ: ఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ.: సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్: ఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.

Sponsored links

Suvarna Sundari Censor Completed :

Suvarna Sundari Ready to Release

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019