విజయ్ దేవరకొండ కంటే స్పీడ్‌గా ఉన్నాడుగా!!

Vijay Deverakonda Brother Signs One more Movie

Fri 24th May 2019 10:20 AM
anand deverakonda,dorasani,second film,confirmed  విజయ్ దేవరకొండ కంటే స్పీడ్‌గా ఉన్నాడుగా!!
Vijay Deverakonda Brother Signs One more Movie విజయ్ దేవరకొండ కంటే స్పీడ్‌గా ఉన్నాడుగా!!
Advertisement

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ ఎవరు అంటే అందరు ఠక్కున రౌడీస్టార్‌ విజయ్‌ దేవరకొండ పేరే చెబుతారు. అతి తక్కువ చిత్రాలతో, తనదైన కథలు, టైటిల్స్‌, లిప్‌లాక్‌ సీన్స్‌.. రౌడీ యాటిట్యూడ్‌తో ఆయన వరస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన భరత్‌కమ్మ దర్శకత్వంలో ‘డియర్‌ కామ్రేడ్‌’, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కె.యస్‌.రామారావు నిర్మాతగా ‘బ్రేకప్‌’ ( వర్కింగ్‌టైటిల్‌)దక్షిణాది అన్ని భాషల్లో ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ చిత్రాలను చేస్తున్నాడు. ఇక ఈయన అతి తక్కువ వ్యవధిలోనే తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండని కూడా హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాడు. 

ఇందులోఆనంద్‌ దేవరకొండ సరసన రాజశేఖర్‌-జీవితల చిన్నకుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్రం పేరు ‘దొరసాని’. ఇలా ఈ చిత్రం ద్వారా ఏకంగా హీరోహీరోయిన్లు ఇద్దరు పరిశ్రమకు పరిచయం కానుండటం విశేషం. డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈయన మొదటి చిత్రం విడుదల కాకముందే ఆనంద్‌ దేవరకొండ నటించే రెండో చిత్రం కూడా కన్‌ఫర్మ్‌ అయిపోయిందట. మధుర శ్రీధర్‌ హీరోగా పవన్‌ సాధినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. గతంలో ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ చిత్రంతో పవన్‌ సాధినేనికి మంచి పేరే వచ్చింది. కానీ ఆయన నారారోహిత్‌తో తీసిన ‘సావిత్రి’ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. 

ఇక అల్లుశిరీష్‌ ‘ఎబిసిడి’ చిత్రం కోసం కూడా స్క్రీప్ట్‌వర్క్‌లో పవన్‌ సాధినేని పనిచేశాడని స్వయంగా నిర్మాత మధుర శ్రీధర్‌ తెలిపిన సంగతి తెలిసిందే. ఎంత విజయ్‌ దేవరకొండ సోదరుడు అయినా ‘దొరసాని’తో తానేంటో ఆనంద్‌ దేవరకొండ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కుదిరితే దొరసాని విడుదలకు ముందే ఆనంద్‌ దేవరకొండ రెండో చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది టాక్‌. 

Vijay Deverakonda Brother Signs One more Movie:

Anand Deverakonda Second Film Confirmed 


Loading..
Loading..
Loading..
advertisement