‘సాహో’లో కండలవీరుడు.. నిజమేనా?

Thu 23rd May 2019 03:10 PM
saaho,salman khan,prabhas,special role,saaho movie update  ‘సాహో’లో కండలవీరుడు.. నిజమేనా?
Salman Khan In Saaho? ‘సాహో’లో కండలవీరుడు.. నిజమేనా?
Sponsored links

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తరువాత ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ మూవీ ‘సాహో’ చేస్తున్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ మార్కెట్ కూడా ఇండియా వైడ్ పెరగడంతో ఈమూవీని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. 

క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి ఈమూవీకి సంబంధించి ఏదొక న్యూస్ బయటకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదే ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నాడని.

ఇక ఇందులో విలన్ పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నాడు. అయితే నీల్ నితిన్ ముఖేష్ అండ్ సల్మాన్ మంచి స్నేహితులు కాబట్టి సల్మాన్ ని ఆయనే సజస్ట్ చేసారని సమాచారం. మరి దీనికి సల్లూభాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇస్తే మాత్రం ఈ సినిమాకి పెట్టి ఖర్చు పెట్టిన మొత్తం నెల లోపే వచ్చేయడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈమూవీకి బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుంది. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాల్సిఉంది.

Sponsored links

Salman Khan In Saaho?:

Saaho Movie Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019