ఏంటి.. సాహో సర్‌ప్రైజ్ లుక్ కాపీనా?

Thu 23rd May 2019 02:48 PM
prabhas,saaho movie,sruprise look,copy allegations  ఏంటి.. సాహో సర్‌ప్రైజ్ లుక్ కాపీనా?
Saaho Special In Copy Allegations Soup ఏంటి.. సాహో సర్‌ప్రైజ్ లుక్ కాపీనా?
Sponsored links

రెండు రోజుల కిందట ఓ వీడియో వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ప్రభాస్ ఓ వీడియో రిలీజ్ చేసాడు. అందులో ప్రభాస్... హాయ్ డార్లింగ్స్ రేపు (అంటే నిన్న) మీకోసం ఓ సర్ ప్రైజ్ ఇస్తున్న నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి టచ్ లో ఉండండి అని ఓ వీడియోను రిలీజ్ చేసారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంత సర్ ప్రైజ్ మాములుగా ఉండదు ఏదో టీజర్ రిలీజ్ చేయబోతున్నారు అని అంత ఆశించారు. కానీ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు జల్లుతూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

పోస్టర్ రిలీజ్ చేస్తే రిలీజ్ చేసారు కానీ ఆ పోస్టర్ ని చూస్తుంటే మంచు విష్ణును గుర్తుచేసింది. అవును కొన్నేళ్ల కిందట ఇదే సెటప్ తో, అదే అద్దాలతో మంచు విష్ణు ఓ ఫొటో షూట్ చేయించుకున్నాడు. ఇప్పుడు అచ్చం అలానే ప్రభాస్ లుక్ కూడా ఉండడం విశేషం. ప్రభాస్ బదులు మంచు విష్ణు మాత్రమే కనిపిస్తున్న ఈ పోస్టర్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

అంతటితో అయిపోలేదు. ఈ పోస్టర్ ని ఓ హాలీవుడ్ సిరీస్ నుంచి కాపీ కొట్టారంటూ మరికొందరు ఉదాహరణలు చూపిస్తున్నారు. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బ్రేకింగ్-బ్యాడ్ అనే టెలివిజన్ సిరీస్ కు సరిగ్గా ఇలాంటి ప్రచారమే చేశారు. ఆ పోస్టర్, సాహో పోస్టర్ ఒకేలా కనిపిస్తాయి. ఈ రెండు స్టిల్స్ ను సోషల్ మీడియాలో పెట్టి విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ చిత్రం 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆగస్టు 15 న రిలీజ్ చేస్తునట్టు అధికారంగా ప్రకటించారు.

Sponsored links

Saaho Special In Copy Allegations Soup:

Copy Allegations on Saaho Sruprise Look

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019