ఆ ఘనత సాధించబోతోన్న తొలి చిత్రం ‘సాహో’

Tue 21st May 2019 01:55 PM
saaho,prabhas,record,saaho records,young rebel star,saaho time  ఆ ఘనత సాధించబోతోన్న తొలి చిత్రం ‘సాహో’
Saaho.. Rare Record ఆ ఘనత సాధించబోతోన్న తొలి చిత్రం ‘సాహో’
Sponsored links

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలి సిరీస్ తరువాత బాగా పెరిగిపోయింది. అందుకే తన నెక్స్ట్ మూవీ ‘సాహో’ చిత్రానికి రూ.200 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెడుతున్నారు. బిజినెస్ 300 కోట్లు వరకు చేసింది. హిట్ టాక్ వస్తే ఇంత మొత్తం రావడం పెద్ద విషయం కాదు. దేశ‌వ్యాప్తంగా ఈ చిత్రానికి విప‌రీత‌మైన క్రేజ్ ఉండ‌టంతో అందుకు త‌గ్గ‌ట్లే రిలీజ్ కూడా భారీగా ఉండేలా చూసుకుంటోంది యువి క్రియేష‌న్స్ సంస్థ‌.

ఈసినిమాను తెలుగుతో పాటు ఇండియా మొత్తంగా త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రానికి రాని స్థాయిలో ఏకంగా 10 వేల స్క్రీన్ల‌లో రిలీజ్ కాబోతోంద‌ట‌ ‘సాహో’. ఇప్పటివరకు ఆ రికార్డు ‘బాహుబ‌లి: ది కంక్లూజ‌న్’ చిత్రానికి ఉంది. ఈమూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 9 వేల‌కు పైగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు.

ఓవర్సీస్‌లో సైతం ‘సాహో’కు భారీగా స్క్రీన్లు బుక్ చేస్తున్నార‌ట‌. 10 వేల స్క్రీన్ల క్ల‌బ్బులో చేరుతున్న తొలి చిత్రం ‘సాహో’నే కావ‌డం తెలుగు సినిమాకే గ‌ర్వ‌కార‌ణం. ఇక ఈమూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. ఆగస్టు 15న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ప్రభాస్ సరసన శ్రద్ధ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Sponsored links

Saaho.. Rare Record:

Saaho Release in 10000 Screens 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019