‘కిల్లర్’ ట్రైలర్ ఎలా ఉందంటే..?

Tue 21st May 2019 12:22 AM
killer,killer trailer talk,killer trailer review,killer movie,vijay antony,arjun  ‘కిల్లర్’ ట్రైలర్ ఎలా ఉందంటే..?
Killer Trailer Review ‘కిల్లర్’ ట్రైలర్ ఎలా ఉందంటే..?
Sponsored links

విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం ‘కొలైగార‌న్’. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మర్డర్‌ మిస్టరీ, క్రైమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా జూన్ తొలి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్, పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ చిత్రం ట్రైలర్‌ని సోమవారం రిలీజ్ చేశారు నిర్మాతలు.

ట్రైలర్ ఎలా ఉందంటే..

అర్జున్, విజయ్ ఆంటోనీలు ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలో నటించడం కొత్తకాదు కానీ.. ఈ సినిమాలో మాత్రం వారిద్దరూ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. హీరోయిన్ ప్రేమ కోసం విజయ్ ఆంటోని కిల్లర్‌గా మారడం, కిల్లర్‌గా మారిన విజయ్ ఆంటోని వేసే స్కెచ్‌లను కనిపెట్టే పోలీసాఫీసర్ పాత్రలో అర్జున్ పాత్రలు చక్కగా కుదిరాయి. నాజర్ చెప్పిన డైలాగ్‌‌తో ఈ మూవీ మెయిన్ థీమ్ అర్ధం అయినప్పటికీ, ట్రైలర్ చివరిలో విజయ్ ఆంటోని మనుషుల్ని చంపే విధానం స్టోరీపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఒక థ్రిల్లర్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. వన్ సైడ్ లవ్ అనే హిట్ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కిల్లర్ ట్రైలర్.. సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేసేలా కట్ చేశారు. ఇక సినిమా రిజల్ట్ ఏమిటనేది జూన్ 5వ తేదీన తెలిసిపోనుంది. 

ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 

యాక్ష‌న్ కింగ్ అర్జున్ , హీరో విజయ్ ఆంటోనీ లు పోటాపోటీగా నటించారు.. ఈ చిత్ర కథ ఎంతో ఆసక్తిగా ఉన్నందువల్లే ఈ సినిమాని తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాం. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్నీ ఇందులో ఉన్నాయి. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది. అర్జున్ న‌ట‌న సినిమాకే హైలైట్..అన్నారు. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి మాక్స్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

Click Here for Trailer

Sponsored links

Killer Trailer Review:

Arjun, Vijay Antony Killer Trailer released 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019