‘కిల్లర్’ ట్రైలర్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్!

Mon 20th May 2019 12:37 PM
vijay antony,arjun,killer movie,trailer,release,may 20  ‘కిల్లర్’ ట్రైలర్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్!
Countdown Start for Killer Trailer ‘కిల్లర్’ ట్రైలర్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్!
Sponsored links

క్రేజీ హీరో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్‌’. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మర్డర్‌ మిస్టరీ,  క్రైమ్ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అషిమా కథానాయికగా నటించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు..ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్, పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమాపై అంచనాలను పెంచింది.. టీజర్ ని బట్టి  విజ‌య్ ఆంటోని.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ పోటాపోటీగా న‌టించే చిత్ర‌ం అని తెలుస్తోంది. సైమ‌న్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి మాక్స్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. 

నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్ 

సాంకేతిక నిపుణులు : 

కథ & దర్శకుడు: ఆండ్రూ లూయిస్

నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్

బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌

సంగీతం: సైమన్ కే కింగ్

సాహిత్యం మరియు సంభాషణలు: భాష్యశ్రీ

సినిమాటోగ్రఫీ: మాక్స్

ఎడిటర్: రిచర్డ్ కెవిన్

ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్

పి.ఆర్.ఓ: సాయి సతీష్

Sponsored links

Countdown Start for Killer Trailer:

Killer Trailer Release on May 20

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019