‘శివరంజని’ ట్రైలర్ వదిలారు..!

Thu 16th May 2019 03:22 PM
vv vinayak,sivaranjani,trailer,launched  ‘శివరంజని’ ట్రైలర్ వదిలారు..!
VV Vinayak Launches Sivaranjani Trailer ‘శివరంజని’ ట్రైలర్ వదిలారు..!
Sponsored links

మాసివ్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘‘శివరంజని’’ ట్రైలర్ విడుదల

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి మంచి కంటెంట్ తో వస్తోన్న చిత్రమే ‘‘శివరంజని’’. హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలకపాత్రలో నటించిన ఈ చిత్ర ట్రైలర్ ను సెన్షేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ గారు మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ చాలా బావుంది. టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడు వస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని.. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి చిన్న చిత్రాలకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. ఇలాంటి నిర్మాతలకు మంచి విజయాలు వస్తే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఇంకా ఎక్కువగా షైన్ అవుతాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలకు మంచి పేరుతో పాటు డబ్బులు కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఇక దర్శకుడు నాగప్రభాకరన్ చిత్ర కంటెంట్ ను గురించి తెలియజేస్తూ.. ‘హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా కనిపించే కథ ఇదని చెప్పారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మధ్య నడిచే హారర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయన్నారు. సింపుల్ గా ఇది హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా చెప్పొచ్చు. ఊహించని కథ, కథనాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నాం. అలాగే మేం అడగ్గానే వచ్చి మా సినిమా ట్రైలర్ విడుదల చేసిన వినాయక్ గారికి కృతజ్ఞతలు తెలిజయచేసుకుంటున్నాను’’ అన్నారు..

నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల చేయడం మాకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. శివరంజని తప్పకుండా నేటి ట్రెండ్ లో వస్తోన్న హారర్ చిత్రాల్లో భిన్నమైన సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఇక నుంచి మా బ్యానర్ లో మంచి కాన్సెప్ట్స్ ఉన్న చిత్రాలకు ఈ యేడాది మరిన్ని రాబోతున్నాయి. అవన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయనే నమ్మకం మాకుంది’’ అని చెప్పారు.. హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ మూవీ శివరంజనిలో నందు, రష్మి గౌతమ్ జంటగా నటిస్తుండగా నందినీరాయ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఇతర పాత్రల్లో అఖిల్ కార్తీక్, ధన్ రాజ్, ఢిల్లీ రాజేశ్వరి, నటిస్తున్నారు.

యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సురేందర్ రెడ్డి, సంగీతం : శేఖర్ చంద్ర, సమర్పణ : నల్లా స్వామి, పి.ఆర్.ఓ : జి.ఎస్.కే మీడియా, సహ నిర్మాత : కటకం వాసు, నిర్మాతలు : ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు, దర్శకత్వం : నాగ ప్రభాకరన్.

Sponsored links

VV Vinayak Launches Sivaranjani Trailer:

Sivaranjani Trailer Launched

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019