ఈసారి అశ్వనీదత్ లేకుండానే ప్లాన్ చేస్తున్నారు

Tue 14th May 2019 08:04 PM
dil raju,pvp,vamsi paidipalli,new movie  ఈసారి అశ్వనీదత్ లేకుండానే ప్లాన్ చేస్తున్నారు
Dil Raju and PVP Plans Movie With Vamsi paydipalli ఈసారి అశ్వనీదత్ లేకుండానే ప్లాన్ చేస్తున్నారు
Sponsored links

వంశి పైడిపల్లితో పీవీపీ నిర్మాతగా ఊపిరి సినిమా చేసాడు. ఆ సినిమా హిట్ అయినప్పటికీ.. లాభాలు రాలేదు కాని.. నిర్మాత నష్టాలూ పాలుకాలేదు. అయితే తాజాగా పీవీపీ, దిల్ రాజు, అశ్వినీదత్ లు కలిసి వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాని భారీగా నిర్మించారు. ఆ సినిమా హీట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే సినిమా మొదలైనప్పటి నుండి..... చివరి రోజులంటే బిజినెస్ జరిగే వరకు ఆశ్వినిదత్ కి, దిల్ రాజు కి పొరపొచ్చాలు వస్తూనే ఉన్నాయి. అయితే దిల్ రాజు, అశ్వినీదత్ ల మధ్యలో పీవీపీ వేలు పెట్టకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇక మహర్షి సినిమాకి 7 కోట్లు అశ్వినీదత్ కి లాభం కింద ఇచ్చేసి అతన్ని దిల్ రాజు బ్యాచ్ వదిలించుకున్నారనే న్యూస్ నడిచింది.

తాజాగా పివిపి, దిల్ రాజు లిద్దరు మళ్ళీ వంశి పైడిపల్లితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట. తమకు మహర్షి స్క్రిప్ట్ చెప్పినప్పుడే... వంశితో మరో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యారట. పివిపి - దిల్ రాజు - వంశి పైడిపల్లి కాంబోలో మరో సినిమా ఉంటుందనే ప్రచారం మొదలైంది... మహర్షి సినిమా మాటల్లోనే ఈ మరో సినిమా మాటలు కూడా జరిగాయని.... అందుకుగాను వంశి పైడిపల్లిని మూడు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి మరీ పీవీపీ, దిల్ రాజు లాక్ చేశారనే టాక్ నడుస్తుంది. అయితే ఈసారి ఈ డీల్ లో అశ్వినీదత్ ని, దిల్ రాజు, పీవీపీ లు ఎంటర్ కానివ్వకుండా వీరిద్దరే ప్లాన్ చేశారనే టాక్ కూడా ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అయితే ఆ సినిమాకి హీరో ఎవరనేది వంశి పైడిపల్లి రాసుకునే స్క్రిప్ట్ ని బట్టి దిల్ రాజు సెట్ చేస్తాడంటున్నారు. మరి వంశీ మరో మంచి స్క్రిప్ట్ తో వస్తే మళ్ళీ భారీ నిర్మాతలు వంశీకి దొరికినట్టే..!

Sponsored links

Dil Raju and PVP Plans Movie With Vamsi paydipalli:

Maharshi Producers Separated

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019