‘నిజం’ తీసి చేతులు కాల్చుకున్నా: తేజ

Tue 14th May 2019 03:41 PM
director teja,latest,interview,updates  ‘నిజం’ తీసి చేతులు కాల్చుకున్నా: తేజ
Director Teja sensational comments on Nijam ‘నిజం’ తీసి చేతులు కాల్చుకున్నా: తేజ
Sponsored links

సినిమాలు అనేది కేవలం వినోదానికి మాత్రమే అని మెసేజులు ఇవ్వడానికి కాదని డైరెక్టర్ తేజ లేటెస్ట్ గా ఓ టీవీ  చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేను మెసేజులు ఇవ్వడం కోసం మహేష్ బాబుతో ‘నిజం’ అనే సినిమా తీసా కానీ ఏమైంది చేతులు, కాళ్లూ కాల్చుకున్నానని అన్నాడు.

మరోసారి అటువంటి తప్పు చేయను అని ఆయన అన్నారు. ఇక ప్రస్తుతం తను తీస్తున్న ‘సీత’ సినిమాలో కాజల్ హీరోయిన్ గా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో కాజల్ పాత్ర చాలా అగ్రెసివ్ గా ఉంటుందని చెప్పారు. రామాయణంలో సీత ఏమో చాలా సాఫ్ట్ గా ఉంటుంది... మా సినిమాలో సీత పాత్ర వేసిన కాజల్ ఏమో చాలా అగ్రెసివ్ గా ఉంటుందన్నారు. తన మొదటి సినిమా నుండి తన సినిమాల్లో అమ్మాయిలను స్ట్రాంగ్ గానే చూపిస్తానని గుర్తు చేసారు.

మరోసారి కాజల్ తో తీయడానికి కారణం ఆమె ఈ కథ విని తానే ఈ సినిమా చేస్తా నాకు కథ బాగా నచ్చింది ఎవరితో తీయకు అని చెప్పడంతో ఆమెతోనే సినిమా చేశా అని స్పష్టం చేశారు. సీన్ పండడం కోసం నేను ఏదైనా చేస్తానని.. అంతగా అవసరం అయితే కొడతా అని కూడా చెప్పారు. రాజకీయ నాయకులు పార్టీలు మారినట్టుగా సినిమా వాళ్ళు ప్రతి శుక్రవారం  మారుతుంటారని తేజ అభిప్రాయపడ్డారు.

Sponsored links

Director Teja sensational comments on Nijam:

Director Teja Latest Interview updates

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019