Advertisement

‘రూలర్’.. టైటిల్ రిజిస్టర్ చేయించారు

Sun 12th May 2019 06:05 PM
balakrishna,ks ravi kumar,c kalyan,next movie,title,ruler  ‘రూలర్’.. టైటిల్ రిజిస్టర్ చేయించారు
Ruler Title for Balayya ‘రూలర్’.. టైటిల్ రిజిస్టర్ చేయించారు
Advertisement

బాలకృష్ణ.. తనకి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా అనౌన్స్ చేసి మరీ... ఆ సినిమాని పక్కనబెట్టి మరో దర్శకుడితో తన కొత్త సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. జై సింహాతో యావరేజ్ హిట్ ఇచ్చిన కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మాతగా మొదలుపెట్టబోతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ప్లాప్స్ తర్వాత బోయపాటితో మళ్ళీ సినిమా చేస్తే వర్కౌట్ అవదని.. కె ఎస్ రవికుమార్ తో సినిమా తలపెట్టాడు. ఈ సినిమాలో లెజెండ్ సినిమాలో తనతో పోటాపోటీగా నటించిన జగపతి బాబు విలన్ గా నటించబోతున్నాడని చిత్రయూనిట్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.

ఇంకా హీరోయిన్ గా హరిప్రియ పేరు పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక జై సింహా టీం మళ్ళీ బాలయ్య కొత్త చిత్రానికి పనిచెయ్యబోతోందని ప్రచారం జరుగుతుండగా... ఇప్పుడు బాలయ్య - రవికుమార్ సినిమా టైటిల్ ప్రచారంలోకొచ్చింది. అది కూడా బాలకృష్ణ అన్న కొడుకు ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలోనూ ఒక పాటకి సంబందించిన లిరిక్ ని టైటిల్ గా పెట్టబోతున్నారట. ఎన్టీఆర్ - బోయపాటి కాంబోలో వచ్చిన దమ్ము సినిమాలో ఎన్టీఆర్ రూలర్ అంటూ మహారాజు వేషంతో ఒక పాట పాడతాడు. 

ఇప్పుడు ఆ రూలర్ అనే పదాన్ని బాలయ్య తన సినిమా టైటిల్ గా ఓకే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో బాల‌య్య ఓ లంచ‌గొండి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని.. అందుకే రూలర్ అనే టైటిల్ ఈ కథకు సరిగ్గా సరిపోతుందని... ఇప్పటికే ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో సి.క‌ల్యాణ్ ఈ పేరుని రిజిస్ట‌ర్ చేయించారట. అది బాల‌య్య‌కు ఖాయ‌మ‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి అని అంటున్నారు.

Ruler Title for Balayya:

Balakrishna and KS Ravi Kumar Film Title Ruler

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement