ఈ భామకు బ్లాక్‌బస్టర్ ఇక కలేనా?

Fri 10th May 2019 07:00 PM
pooja hegde,heroine,blockbuster,maharshi,mahesh babu,dream  ఈ భామకు బ్లాక్‌బస్టర్ ఇక కలేనా?
Again This Heroine Missed BlockBuster ఈ భామకు బ్లాక్‌బస్టర్ ఇక కలేనా?
Sponsored links

టాప్ రేంజ్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతున్న పూజా హెగ్డే.. తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా అందుకోలేకపోతుంది. గత ఏడాది అరవింద సమేతలో టైటిల్ రోల్ పోషించినా... పూజా హెగ్డేకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ సినిమా హిట్ ని ఎన్టీఆర్ ఖాతాలో కాదు కాదు జేబులో వేసుకున్నాడు. పూజా హెగ్డేకి ఆ బ్లాక్ బస్టర్ అనే పదం అందని ద్రాక్షలాగే మిగిలిపోయేలా కనబడుతుంది. గత ఏడాది ఎన్టీఆర్ తో అరవిందలో నటిస్తే అది ఓ అన్నంత హిట్ కాలేదు. ఇక ఈ ఏడాది మహేష్ ని నమ్ముకుంది. మహేష్ తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్రని కీలకంగా చూపించలేకపోయాడు వంశీ పైడిపల్లి. పూజాని గ్లామర్ డాల్ లాగే చూసినట్లుగా కనబడుతుంది. పూజా హెగ్డే తన వరకు తాను అందంగానే కనబడింది. ఇక మహేష్ తో సాంగ్స్ లోను అందాలు ఆరబోతలో ఎక్కడా తగ్గలేదు.

కానీ సినిమాలో పూజ పాత్రే ఓ అన్నంతగా ప్రేక్షకులకు ఎక్కలేదు. పూజా హెగ్డే నటనకు అంత అవకాశం లేదు. అందుకే హీరోయిన్ పూజా హెగ్డే గురించి అంత ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు అన్నట్లుగా క్రిటిక్స్ పెదవి విరుపులు. మొదటినుండి అంటే మహర్షి ట్రైలర్ లోనే పూజా హెగ్డే మహర్షిలో కేవలం గ్లామర్ డాల్ పాత్ర తప్ప నటనకు ఆస్కారం ఉండదని అన్నారు. అన్నట్లుగానే పూజా హెగ్డేని దర్శకుడు సరిగా వాడుకోలేదు. మహేష్ - పూజా హెగ్డే లకు మంచి రొమాంటిక్ లవ్ ట్రాక్ పెట్టలేదు. మరి డీజే, అరవింద సమేతలాంటి పెద్ద సినిమాల్లో పూజా పరిస్థితి ఎలా ఉందో.. తాజాగా మహర్షిలోనూ పూజ పాత్ర అలానే ఉంది. మరి ఈ మహర్షి మూవీతో కూడా పూజ కోరిక తీరకుండా పోయిందనే చెప్పాలి. మహర్షికి యావరేజ్ టాక్ పడడం కూడా పూజా హెగ్డేకి మింగుడు పడని విషయమే.

Sponsored links

Again This Heroine Missed BlockBuster :

Heroine Pooja Happy but Disappoints with Maharshi Result

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019