‘జాలరి’ కాదు.. టైటిల్ ఫిక్సయింది

Sun 05th May 2019 12:32 PM
vaishnav tej,film title,uppena,fixed  ‘జాలరి’ కాదు.. టైటిల్ ఫిక్సయింది
Vaishnav Tej Film Title Fixed ‘జాలరి’ కాదు.. టైటిల్ ఫిక్సయింది
Sponsored links

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో దిగుతున్నాడు. ఇప్పటికే క్రికెట్ టీమ్‌ నెంబర్‌కు దగ్గరవుతున్న మెగా టీమ్‌లో ఇప్పుడు రాబోతోంది మరెవరో కాదు.. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడు. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసుకున్న ఈ చిత్ర టైటిల్ గురించి రెండు మూడు రోజులుగా నెట్ ప్రపంచంలో గట్టిగా వినిపిస్తోంది.

ఎవరో నెట్‌లో ఈ సినిమాకు ‘జాలరి’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ను విడుదల చేయగా.. దానినే ఈ చిత్ర టైటిల్ అంటూ కొందరు వార్తలు సృష్టించేశారు. అయితే ఈ చిత్రానికి టైటిల్‌ను చిత్రయూనిట్ ఎప్పుడో రిజిష్టర్ చేయించిందట. సడెన్‌గా ఈ చిత్రానికి ‘జాలరి’ అనే టైటిల్ వినిపించడంతో చిత్రయూనిట్ కూడా ఇప్పుడు ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి ఈ చిత్రానికి ‘ఉప్పెన’ అనే టైటిల్‌ను మేకర్స్ రిజిస్టర్ చేయించారట. కానీ సోషల్ మీడియాలో ‘జాలరి’ అనే టైటిల్‌కు మంచి రెస్సాన్స్ వస్తుండటంతో మేకర్స్ కూడా ఈ టైటిల్ పెడితే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నారట.

పరువు హత్యల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్ర కథ చాలా అద్భుతంగా వచ్చిందని, గ్యారంటీగా వైష్ణవ్ ఎంట్రీతోనే చాలా గొప్ప నటుడిగా నిరూపించుకునే అవకాశం ఉన్న స్టోరీ అని అంటున్నారు. ఇక హీరోయిన్‌గా మనీషా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టాప్ టెక్నిషీయన్స్ పనిచేస్తున్న ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతోందని అప్పుడే మెగా సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

Sponsored links

Vaishnav Tej Film Title Fixed:

Uppena is the Vaishnav Tej Film Title

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019