Advertisement

బిగ్‌బాస్ ‌1, 2 అవకాశం నాకే వచ్చింది: బన్నీ

Fri 03rd May 2019 06:39 PM
allu arjun,allu aravind,sukumar,trolling,bunny,issues,allu arjun interview,bigg boss,bollywood  బిగ్‌బాస్ ‌1, 2 అవకాశం నాకే వచ్చింది: బన్నీ
Stylish Star Allu Arjun Latest Interview బిగ్‌బాస్ ‌1, 2 అవకాశం నాకే వచ్చింది: బన్నీ
Advertisement
  • >అల్లు అరవింద్, బన్నీ మధ్య గొడవలా..!!
  • >అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
  • >ట్రోలింగ్‌పై బన్నీ అభిప్రాయం ఏమిటి? 

అల్లుఅర్జున్‌.. మెగా కాంపౌండ్‌ స్టార్‌గా, అల్లు వారి వారసునిగా ఆయనకు ఎంతో పేరుంది. ముఖ్యంగా ఎన్నుకొనే కథలు, మేకోవర్‌, లుక్స్‌ వంటివి ట్రెండీగా తెలుగు వారికి కొత్తదనం పరిచయం చేసే విధంగా ఉంటాయి. తాజాగా అల్లుఅర్జున్‌ ఓ మేగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను చెప్పుకొచ్చాడు. బన్నీకి మలయాళంలోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా ఎంతో గుర్తింపు ఉంది. ఆయన చిత్రాలు డబ్‌ అయి యూట్యూబ్‌లలో అదరగొడుతూ ఉంటాయి. ఇక్కడ తెలుగులో ఫ్లాప్‌ అయిన ఆయన చిత్రాలు ఇతర భాషల్లో మాత్రం యూట్యూబ్స్‌ని షేక్‌ చేస్తూ ఉంటాయి. 

ఆయన మాట్లాడుతూ, నేను కంఫర్టబుల్‌ జోన్‌ నుంచి బయటకువచ్చేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. బాలీవుడ్‌ చిత్రాలలో నటించే అవకాశం కూడా ఉందని చెప్పగలను. నేను, నాన్నగారు గతంలో మాటీవీ డైరెక్టర్స్‌ బోర్డ్‌లో మెంబర్లుగా ఉండేవారం. అప్పుడు నాకు బిగ్‌బాస్‌1, 2లలో పనిచేసే అవకాశం వచ్చింది. నేను వద్దనుకున్నాను. అది నా స్పేస్‌ కాదు. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా సినిమాల మీదనే. నాకు, మా నాన్నగారికి గొడవ జరిగిందని ఇటీవల వార్తలు వచ్చాయి. వాటిని చూసి మేమిద్దరం పెద్దగా నవ్వుకున్నాం. ఈమధ్యకాలంలో నేను చదివిన అతి పెద్ద జోక్‌ అదే. నేను నాన్నతో కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. ప్రతిరోజు మేము చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సుకుమార్‌ సౌత్‌లో ఎంతో క్రియేటివిటీ, మోస్ట్‌ టాలెంటెడ్‌, వండర్‌ఫుల్‌ డైరెక్టర్స్‌లో ఒకరు. నాకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌లో ఒకరు. పర్సనల్‌గా నేను స్పాంటేనియస్‌ యాక్టింగ్‌ని ఇష్టపడతాను. నేను ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను ఫిలిం బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చిన వాడిని అని చెప్పాలి. నా విషయంలో నెపోటిజం ఉంది. నేను దానిని తప్పించుకోలేను.

కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నెపోటిజం ఉండవచ్చు.. లేకపోవచ్చు. చివరకు ఇండస్ట్రీలో రాణించేవారు మాత్రం టాలెంట్‌ ఉన్న వారే. అప్పుడప్పుడు గూగూల్‌ని సెర్చ్‌ చేస్తూ ఉంటాను. ప్రతి సినిమాలో కొత్తగా ఉండేందుకు కష్టపడుతుంటాను. అందుకే పాత చిత్రాలలో నా లుక్స్‌ని రిఫర్‌ చేసుకుంటూ ఉంటాను. ట్రోలింగ్‌తో నాకేమీ ప్రాబ్లమ్‌ లేదు. ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. అది వాళ్లు చెప్పుకోవచ్చు. అయితే నన్ను ఇబ్బంది పెట్టేది మాత్రం వాడే భాష. మర్యాదపూర్వకమైన భాషల్లో విమర్శలు చేస్తే పట్టించుకోను గానీ భాష సరిగాలేనప్పుడు మాత్రం ఆ విమర్శలకు విలువ ఉండదని నేను నమ్ముతాను అని చెప్పుకొచ్చాడు. 

Stylish Star Allu Arjun Latest Interview:

Bunny Clarity on Issues with His Father 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement