Advertisement

ఎట్టకేలకు మెహ్రీన్‌కు ఓ ఛాన్స్ వచ్చింది

Fri 03rd May 2019 12:21 PM
mehreen,heroine,gopichand,tiru film,tollywood,chance  ఎట్టకేలకు మెహ్రీన్‌కు ఓ ఛాన్స్ వచ్చింది
Mehreen gets Chance in Tollywood ఎట్టకేలకు మెహ్రీన్‌కు ఓ ఛాన్స్ వచ్చింది
Advertisement

ఈ ఏడాది స్టార్టింగ్ లో ఎఫ్ 2 చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ మెహ్రీన్ కి పాపం ఎందుకు ఆ తరువాత టాలీవుడ్ నుండి ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఈనేపధ్యంలో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పబోతోంది అని వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ.. మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది.

గోపీచంద్-తిరు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతుందని తెలిసిందే. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా ఓకే అయింది. రీసెంట్ గా డైరెక్టర్ తిరు మెహ్రీన్ కి స్టోరీ చెప్పాడట. కథ మెహ్రీన్ కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసేసిందట. త్వరలోనే ఇది అధికారంగా ప్రకటించనున్నారు. గతంలో గోపీచంద్ - మెహ్రీన్ కాంబినేషన్ లో ‘పంతం’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ తమిళ ఇండస్ట్రీకి సంబందించిన వాడు కావడంతో ఈ మూవీని రెండు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Mehreen gets Chance in Tollywood:

Mehreen in Gopichand and Tiru Film

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement