Advertisementt

ఈ బర్త్‌డే నాకు చాలా ‘స్పెషల్’: హీరోయిన్

Tue 30th Apr 2019 10:33 PM
akshatha,birthday special,heroine,special movie  ఈ బర్త్‌డే నాకు చాలా ‘స్పెషల్’: హీరోయిన్
Akshatha Birthday Special ఈ బర్త్‌డే నాకు చాలా ‘స్పెషల్’: హీరోయిన్
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా రంగంలోనే కాదు.. అన్ని భాషల్లోనూ కన్నడ భామలు కదం తొక్కుతున్నారు. బాలీవుడ్‌లో ఐశ్వర్యారాయ్, దీపికా పదుకునె చక్రం తిప్పుతుంటే.. తెలుగులో అనుష్క శెట్టి, రష్మిక మందన్న, తాజాగా శ్రద్ధా శ్రీనాధ్ వెలుగులీనుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరేందుకు మరో కన్నడ భామ ‘అక్షత శ్రీనివాస్’ సన్నాహాలు చేసుకుంటోంది. 

కన్నడలో.. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సర్జా (యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు) సరసన ‘శివ తేజస్’ సినిమా చేస్తున్న అక్షత అక్కడే.. ‘బ్రహ్మచారి- హండ్రెడ్ పర్శంట్ వర్జిన్’ అనే మరో క్రేజీ సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పుడు తాజాగా ‘స్పెషల్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. టాలెంటెడ్ యాక్టర్ అజయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి వాస్తవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మే 1న తన పుట్టిన రోజును పురస్కరించుకుని అక్షత మాట్లాడుతూ.. ‘‘కన్నడలో రెండు క్రేజీ సినిమాలు చేస్తూ.. తెలుగులో ‘స్పెషల్’ మూవీ చేస్తుండడం చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈ బర్త్‌డే నాకు చాలా చాలా స్పెషల్. తెలుగు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నది నా డ్రీమ్’’ అని తెలిపింది.

Akshatha Birthday Special:

One More Kannada Heroine Special in Tollywood

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ