వర్మ చెప్పేది అంతా సొల్లే: ‘స్పెష‌ల్’ ద‌ర్శ‌కుడు

Mon 29th Apr 2019 07:43 PM
rgv,ram gopal varma,vastav,special movie,varma,shiva  వర్మ చెప్పేది అంతా సొల్లే: ‘స్పెష‌ల్’ ద‌ర్శ‌కుడు
Special Movie Director attacked on Varma వర్మ చెప్పేది అంతా సొల్లే: ‘స్పెష‌ల్’ ద‌ర్శ‌కుడు
Advertisement
Ads by CJ

ద గ్రేట్ రామ్‌గోపాల్ వ‌ర్మ కెరీర్ మెద‌ట్లో శివ‌, క్ష‌ణక్ష‌ణం అద్బుత‌మైన‌ చిత్రాలు తీసి చాలా మంది యూత్ ని ద‌ర్శ‌కత్వం వైపు రావ‌టానికి మార్గం వేసిన గురువు. అలాగే ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న కెరీర్ లో జెంటిల్‌మెన్ లాంటి చిత్రం తీసి శ‌భాష్ అనిపించుకున్నాడు. వ‌ర్మ త‌ను చేసిన చిత్రాలు చూసి ఇత‌ను 20 సంవ‌త్స‌రాల త‌రువాత టెర్మినేట‌ర్ లాంటి గొప్ప చిత్రాలు చేస్తాడు అని అనుకునేవారు. శంక‌ర్ ని మాత్రం మంచి చిత్రాలు తీస్తాడు అనుకున్నారు. కాని ఇప్ప‌డు రామ్‌గోపాల్ వ‌ర్మ తీస్తున్న నాసిర‌కం చిత్రాలు ఆఫీస‌ర్‌, ల‌క్ష్మీస్ ఎన్ టి ఆర్‌, ఐస్‌క్రీమ్ లు చూస్తుంటే అభిమానుల‌కి కోపం వ‌స్తుంది. అటు ప‌క్క శంక‌ర్ రోబో లాంటి అత్యాధునిక‌మైన సాంకేతిక ప‌ర‌మైన చిత్రాలు తీస్తున్నాడు.

రామ్‌గాపాల్‌వ‌ర్మ చెప్పేది అంతా సొల్లు.. సొల్లు మాత్ర‌మే.. చాలా మంది అత‌నికి పిచ్చి ప‌ట్టిందేమో అనుకుంటున్నారు. ఆయ‌న అభిమానిగా నేను స్పెష‌ల్ చిత్రాన్ని తీసాను. ఒక్కసారి నా చిత్రం చూసి అప్పుడు మాట్లాడు రామ్‌గోపాల్ వ‌ర్మ అని అంటున్నారు. అంతేకాదు ఇటీవ‌ల మందు తాగి ఎవ‌డో రాసిచ్చిన పాటని పాడి సోష‌ల్ మీడియాలో పెట్టాడు. మినిమ‌మ్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేస్తున్న నువ్వు శివ అనే ఛారిత్రాత్మ‌క చిత్రాన్ని తీసావంటే న‌మ్మ‌లేకున్నాము. నీలాంటి వాడిని నమ్మి నిర్మాత‌లు, న‌టీన‌టులు మోసపోతున్నారు అని త‌న సోష‌ల్ మీడియాలో ద్వ‌జ‌మెత్తాడు స్పెష‌ల్ చిత్రం ద‌ర్శ‌కుడు వాస్తవ్‌.

Special Movie Director attacked on Varma:

RGV not A Great Director Say Special Movie Director Vastav

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ