Advertisement

‘వజ్రకవచధర గోవింద’కు రిలీజ్ డేట్ ఫిక్స్!

Sun 28th Apr 2019 07:24 PM
sapthagiri,vajra kavacha dhara govinda,release,may 17  ‘వజ్రకవచధర గోవింద’కు రిలీజ్ డేట్ ఫిక్స్!
Vajra Kavacha Dhara Govinda release date fixed ‘వజ్రకవచధర గోవింద’కు రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ’ సినిమాల తర్వాత టాప్ కమెడియన్ హీరో సప్తగిరి నటించిన చిత్రం ‘వజ్రకవచధర గోవింద’. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మే 17న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

ఈ సందర్బంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ.. ‘వజ్రం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. వజ్రాన్ని కవచంగా ధరించడం వల్ల ఎలాంటి లాభ, నష్టాలు జరిగాయనేది ఈ సినిమా కథ. హీరో లక్ష్యం మంచిదై ఉండొచ్చు. కానీ ఎంచుకొన్న మార్గం కూడా మంచిదై ఉండాలి అనేది ఓవరాల్ పాయింట్. మీ లక్ష్యం మంచిదైనా చెడు మార్గంలో వెళితే చెడే జరుగుతుంది అని కథలో మంచి పాయింట్ చెప్పాం. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు యాక్షన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. వజ్రకవచధర గోవింద సినిమా కోసం ప్రాణాలకు తెగించి ఫైట్స్, యాక్షన్ సీన్లలో నటించాను. చిన్న సినిమా కావడంతో సెట్లు వేయడం ఖర్చుతో కూడినది కాబట్టి.. కర్నూలుకు సమీపంలోని గుహాల్లో షూట్ చేశాం. నాతోపాటు హీరోయిన్ కూడా సాహసం చేసింది. హీరోయిన్‌కు కూడా మంచి ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. గోవిందుడు చుట్టు నా సినిమా టైటిల్స్ తిరగడం అనేది దేవుడి అనుగ్రహమనే చెప్పాలి. నా తొలిసినిమాలో కానిస్టేబుల్ కథ చెప్పాం. రెండో సినిమాలో రైతుల గురించి చెప్పాం. ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ గురించి చెప్పబోతున్నాం. ప్రతీ మండలానికి ఓ క్యాన్సర్ హాస్పిటల్ కడితేనే గానీ ఆ వ్యాధిగ్రస్తులను బతికించుకోలేని పరిస్థితి ఉంది. ఈ సినిమాతో వినోదంతోపాటు సామాజిక సందేశాన్ని అందజేస్తున్నాం. సినిమా టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ పెట్టాల్సిన సమయంలో అన్ని రకాలుగా ఆలోచించి.. కథకు సరితూగే టైటిల్ అని డిసైడ్ అయ్యాం. అందుకే భగవంతుడిని స్మరించుకొనే విధంగా ఉంటుందని, అలాగే సెంటిమెంట్ పరంగా ఆ టైటిల్‌‌ను ఫిక్స్ అయ్యాం’’ అని అన్నారు.

దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ.. ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా తర్వాత అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయాలని అదే కాంబినేషన్‌తో మళ్లీ వస్తున్నాం. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో కామెడీ, ఎమోషన్స్ ఎంత వర్కవుట్ అయ్యాయో.. అంతే రేంజ్‌లో వర్కవుట్ కావాలని వెయిట్ చేశాం. నోట్ల రద్దు తర్వాత కూడా ఆ సినిమా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. సప్తగిరికి కామెడీ, సినిమాకు ఎమోషన్స్ వర్కవుట్ అయ్యే విధంగా డిజైన్ చేసిన చిత్రమే ‘వజ్రకవచధర గోవింద’. సప్తగిరి బాడీలాంగ్వేజ్‌కు తగినట్టుగా రూపొందింది’’ అని తెలిపారు.

ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ‘‘సీడెడ్, ఇతర ఏరియాల్లో 35 ఏళ్లుగా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్‌గా ఉన్నాను. సప్తగిరి సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో స్వయంగా చూసిన దాఖలాలు ఉన్నాయి. సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకొన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. కానీ ‘వజ్రకవచధర గోవింద’ టీజర్ చూసిన తర్వాత ఎలాగైనా తీసుకోవాలని అనుకొన్నాను. ఫ్యాన్సీ రేటుకు వరల్డ్ వైడ్ రైట్స్ దక్కించుకొన్నాను. సినిమాను ఇప్పటికే చూశాను. ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ‘వజ్రకవచధర గోవింద’ పెద్ద హిట్ అవుతుంది. ఏపీ మొత్తం సొంతంగా రిలీజ్ చేయబోతున్నాను. ఈ సినిమా మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం’’ అని చెప్పారు.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన జీవిఎన్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘సప్తగిరి సినిమాకు డబ్బులు వస్తాయో రావో అనే విషయాన్ని పట్టించుకోలేదు. సప్తగిరితో సినిమా చేయాలని వచ్చాం. సినిమా ఫీల్డ్‌తో సంబంధం లేకుండా సప్తగిరితో మూవీ చేయాలని వచ్చాం. కర్నూలు గుహల్లో ప్రాణాలకు తెగించి హీరో సప్తగిరి నటించాడు. డబ్బులకు కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం. సినిమా బ్రహ్మండంగా వచ్చింది’’ అని చెప్పారు.

నటీనటులు: వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు

కథ: జి టి ఆర్ మహేంద్ర,

సంగీతం: విజయ్ బుల్గానిన్,

కెమెరా: ప్రవీణ్ వనమాలి,

ఎడిటింగ్: కిషోర్ మద్దాలి,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు,

స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అరుణ్ పవార్.

Vajra Kavacha Dhara Govinda release date fixed:

Vajra Kavacha Dhara Govinda release on May 17

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement