Advertisement

మహేష్, అనిల్ రావిపూడి టైటిల్ ఇదే!

Sat 27th Apr 2019 08:08 PM
mahesh babu,anil ravipudi,film title,sarileru neekevvaru,dil raju,class title  మహేష్, అనిల్ రావిపూడి టైటిల్ ఇదే!
Mahesh Babu, Anil Ravipudi Film Title Sarileru Neekevvaru మహేష్, అనిల్ రావిపూడి టైటిల్ ఇదే!
Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి హాలిడేస్ కి పారిస్ ట్రిప్ వెళ్ళాడు. కొన్ని రోజుల్లో వెనక్కి తిరిగొచ్చి ‘మహర్షి’ ప్రమోషన్స్ లో హాజరు అవుతాడు. ఆ వెంటనే అనిల్ రావిపూడి సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్తాడు. ఎఫ్ 2 తో మంచి జోష్ మీద ఉన్న అనిల్ తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ అధికారంగా లాంచ్ చేయనున్నారు.

ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ పెట్టాలని టీం భావిస్తోందట. వినడానికి పవర్ ఫుల్ టైటిల్ లా ఉంది. మహేష్ కి ఎప్పటినుండో మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ ఉంది. అయితే ఆగడు, స్పైడర్ లాంటి సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసేందుకు ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ కు మహేష్ ఓకే చెప్పినట్టు సమాచారం.

అయితే అనిల్ ఈ టైటిల్ ను ఎప్పుడో ఫిక్స్ అయ్యాడట. ఇప్పటివరకు అనిల్ కు అన్ని ఇంగ్లీష్ టైటిళ్లే అచ్చి వచ్చాయి. ఫస్ట్ టైమ్ ఆయన కూడా ఫర్ ఏ ఛేంజ్ తెలుగు టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. దిల్ రాజు కూడా ఈ టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. త్వరలోనే మిగిలిన డీటెయిల్స్ తెలియనున్నాయి.

Mahesh Babu, Anil Ravipudi Film Title Sarileru Neekevvaru:

Too Class Title For Mahesh Babu Film!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement