మహేష్ గురించి జయసుధ లీక్ చేసేసింది

Fri 26th Apr 2019 08:29 PM
jayasudha,mahesh babu,acting,maharshi movie  మహేష్ గురించి జయసుధ లీక్ చేసేసింది
Jayasudha Talks About Maharshi Movie మహేష్ గురించి జయసుధ లీక్ చేసేసింది
Sponsored links

సూపర్ స్టార్ మహేష్ తన 25 వ చిత్రం ‘మహర్షి’ మే 9 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈసినిమా టీజర్ అంచనాలు పెంచేసింది. ఆల్రెడీ 4 సాంగ్స్ ఈమూవీ నుండి బయటకు వచ్చాయి. త్వరలోనే మే 1 న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకోనుంది. ఇక ఇందులో అల్లరి నరేష్, జయసుధలు కీలక పాత్రలు చేసారు. ఈనేపధ్యంలో నటి జయసుధ.. మహేష్ నటన గురించి మాట్లాడారు..

‘‘విజయ నిర్మల గారికి నేను బంధువును కావడం వల్లన కృష్ణగారి కుటుంబసభ్యులతో నాకు మంచి అనుబంధం వుంది. మహేష్ చిన్నప్పుటి నుండి నేను అతన్ని చూస్తున్న. మహేష్ తో నేను ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ .. ‘బ్రహ్మోత్సవం’ చేశాను. లేటెస్ట్ గా ‘మహర్షి’ సినిమా చేశాను.  ‘మహర్షి’లో ప్రకాశ్ రాజ్ భార్యగా కనిపిస్తాను.

ఈమూవీని డైరెక్టర్ వంశీ పైడిపల్లి చాలా చక్కగా రూపొందించాడు.  మహేశ్ బాబు చాలా బాగా చేశాడు. రెండు సీన్లలో ఆయన నటన చూస్తూ .. నా పాత్ర వైపు నుంచి ఇవ్వాల్సిన రియాక్షన్స్ ఇవ్వకుండా వుండిపోయాను. మహేష్ తో ఆ సీన్స్ చేస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు తెప్పించాడు. మహేష్ నటనకు అవార్డు రావడం ఖాయమని అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు జయసుధ.

Sponsored links

Jayasudha Talks About Maharshi Movie:

Jayasudha About Mahesh Acting in Maharshi Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019