నాని మరో మూవీ ప్రారంభానికి డేట్ ఫిక్స్!

Thu 25th Apr 2019 01:14 PM
nani,indraganti mohanakrishna,gang leader,dil raju,sudheer babu  నాని మరో మూవీ ప్రారంభానికి డేట్ ఫిక్స్!
Nani and Indraganti Movie Opening Date Fixed నాని మరో మూవీ ప్రారంభానికి డేట్ ఫిక్స్!
Sponsored links

‘జెర్సీ’ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న నాని తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ లీడర్’ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత నాని తనకు లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో జరుపుకుంటున్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటించనున్నాడు. ఇక ఈసినిమాను ఆఫిషియల్‌గా ఈనెల 26వ తేదీన లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ వేరే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది. 

సినిమా ఓపెనింగ్ రోజు ఈ సినిమా టైటిల్‌పై క్లారిటీ రానుంది. అదే రోజు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక అదితీరావు, నివేదా థామస్ హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Sponsored links

Nani and Indraganti Movie Opening Date Fixed:

Nani and Indraganti Movie Starts From April 26th

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019