క్రిష్.. కమర్షియల్ దారిలో ఉన్నాడు

Wed 24th Apr 2019 07:00 PM
krish,ntr biopic,krish next film,radhakrishna jagarlamudi,bollywood,commercial format  క్రిష్.. కమర్షియల్ దారిలో ఉన్నాడు
Krish Next Film in Commercial Format క్రిష్.. కమర్షియల్ దారిలో ఉన్నాడు
Sponsored links

క్రిష్ ఇప్పటివరకు కమర్షియల్ చిత్రాలను డైరెక్ట్ చెయ్యలేదు. కెరీర్ స్టార్ట్ చేసినప్పటినుండి.. డిఫ్రెంట్ డిఫ్రెంట్ కథలను ఎంచుకుంటూ.. ఎక్కడా కమర్షియల్ ఎలెమెంట్స్ కోసం పాకులాడలేదు. ‘గమ్యం, వేదం, కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమీపుత్ర శాతకర్ణి, కథానాయకుడు, మహానాయకుడు’ వంటి కథల్తోనే సినిమాలు చేసాడు. క్రిష్ సినిమాలకు క్రిటిక్స్, ప్రేక్షకులు చప్పట్లు కొట్టినా.. ఆ సినిమాలు ఎక్కడా బ్లాక్ బస్టర్ అయిన దాఖలాలు కానీ.. భారీ కలెక్షన్స్ వచ్చిన మాట కానీ వినబడలేదు.

ఇక కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల దెబ్బకి ప్రస్తుతం సైలెంట్ అయిన క్రిష్ త్వరలోనే ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ లో మూవీ చేయబోతున్నాడట. అయితే నిర్మాతలు సెట్ అయినా.. ఎలాంటి కథతో సినిమా చేయాలనే క్లారిటీ క్రిష్ తీసుకోలేకపోతున్నాడట. ఇక ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కి కూడా వరసగా ప్లాప్స్ ఉండడంతో.. క్రిష్‌తో చెయ్యబోయే సినిమాతో ఫామ్ లోకి రావాలని ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ చూస్తుంది. అయితే అంతా ఓకే అనుకున్నాక క్రిష్ మాత్రం ఎలాంటి కథతో సినిమా చేయాలనే విషయంలో ఇంకా తర్జన భర్జనలు పడుతున్నాడని.. అయితే మొదటిసారి క్రిష్ కమర్షియల్ కథ వైపు మొగ్గు చూపుతున్నాడనే టాక్ వినబడుతుంది. 

అలా అనుకునే.. ప్రస్తుతం తాను రాసిన కథలను పక్కన పడేసి.. కమర్షియల్ అంశాలతో మరో కథను ప్రిపేర్ చేసుకునే పనిలో క్రిష్ ఉండబట్టే.. ఎవరికీ దొరకడం లేదని అంటున్నారు. మరి మొన్నామధ్యన క్రిష్ బాలీవుడ్ మూవీ చేస్తాడని వార్తలొచ్చినా.. ముందు టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ కొట్టాకే మళ్ళీ బాలీవుడ్ వైపుకెళ్లాలని క్రిష్ భావిస్తున్నాడట.

Sponsored links

Krish Next Film in Commercial Format:

Update about Krish Next Film

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019