క్రేజ్‌ను బట్టే సమంత తీసుకొంటోంది

Wed 24th Apr 2019 12:08 AM
samantha,remuneration,salary,majili,heroine samantha  క్రేజ్‌ను బట్టే సమంత తీసుకొంటోంది
Samantha Hiked her Salary క్రేజ్‌ను బట్టే సమంత తీసుకొంటోంది
Sponsored links

పెళ్లి అయిన తరువాత బ్యాక్ 2 బ్యాక్ హిట్స్ అందుకున్న అక్కినేని సమంతకు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. యుటర్న్ లో నటన ద్వారా సీమరాజాలో కత్తి సాము ద్వారా ఆకట్టుకున్న సామ్ కి ఈ ఏడాది కూడా అచ్చోచింది. ముందు తమిళ్ లో సూపర్ డీలక్స్ తో బోణీ కొట్టేసిన సామ్ అందులో ఎవరూ ఊహించని పాత్ర చేసి షాక్ ఇచ్చింది. 

ఇక లేటెస్ట్ గా మజిలీ అనే సినిమా బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. పెళ్లి తరువాత నాగ చైతన్య - సామ్ నటించిన మొదటి సినిమా కావడం విశేషం. మజిలీలో ఆమె పాత్ర వేరే ఏ హీరోయిన్ చేసినా అంత ఇంపాక్ట్ ఉండదేమో అన్నట్టు చేసింది. ఇక త్వరలోనే నందిని రెడ్డి డైరెక్షన్ లో ఓ బేబీ, 96 రీమేక్ తో పాటు మన్మధుడు 2 లో కనిపించనుంది. ఇలా సమంత కోసం నిర్మాతలు పెద్ద క్యూ కడుతున్నారు.

ఫిలింనగర్ టాక్ ప్రకారం సమంత ఇప్పుడు రెమ్యూనరేషన్ 3 కోట్ల దాకా చెబుతోందట. పెళ్లి తరువాత ఏ హీరోయిన్ కి అయినా ఇంత క్రేజ్ ఉండదు కానీ సామ్ కు అంతకు మించి క్రేజ్ వచ్చింది.  సో నిర్మాతలు ఆమె ఎంత అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆమెకి కూడా అనుష్కలా మార్కెట్ ఉంది కాబట్టి. ఆమె కోసమే ప్రేక్షకులు సినిమాలకి కూడా వెళ్తున్నారు కాబట్టి.

Sponsored links

Samantha Hiked her Salary :

Samantha Demands 3 Cr for Her Remuneration

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019