మెగాస్టార్ పక్కన కీలకపాత్రలో అనసూయ

Tue 23rd Apr 2019 09:11 PM
anasuya,key role,megastar chiranjeevi,koratala siva,152 movie  మెగాస్టార్ పక్కన కీలకపాత్రలో అనసూయ
Anasuya in Megastar 152 Film మెగాస్టార్ పక్కన కీలకపాత్రలో అనసూయ
Sponsored links

యాంకర్ అనసూయ బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా సత్తా చాటుతుంది. స్పెషల్ సాంగ్స్ అయినా.. విలన్ క్యారెక్టర్స్ అయినా.. సినిమాలో కీలక పాత్ర అయినా, హీరోయిన్ గా అయినా ఏ పాత్రకైనా అనసూయ అందమే కాదు ఆమె నటనకు అందరూ చప్పట్లు కొడుతున్నారు. రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ స్పెషల్ సాంగ్స్ లో అందాలు ఆరబోసేస్తుంది. ఆంటీ అంటే ఒప్పుకోని ఈ భామ ఇప్పటికి పదహారేళ్ళ హీరోయిన్ మాదిరి గ్లామర్ షో చేస్తుంది. ప్రస్తుతం బుల్లితెర మీద వెండితెర మీద బిజీ అయిన అనసూయ తాజాగా సీనియర్ హీరో సినిమాలో ఒక భారీ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినబడుతుంది.

చిరు సైరా సినిమా తర్వాత చెయ్యబోతున్న కొరటాల సినిమాలో చిరంజీవి పక్కన ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు కానీ.. ఆ సినిమాలో నటీనటులు ఎంపిక మాత్రం కొరటాల చేపట్టాడు. ఇప్పటికే కమెడియన్ గా సునీల్ చిరుకి సైడ్ క్యారెక్టర్ లో ఎంపిక చేసిన కొరటాల ఇప్పుడు అనసూయని మరో కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. క‌థ‌లో కీల‌క‌మైన పాత్ర‌లో అన‌సూయ క‌నిపిస్తుంద‌ని... రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌కు ఎంత ప్రాధాన్య‌త ఉందో... ఆ పాత్ర అనసూయకి ఎంతగా పేరు తెచ్చిందో... ఈ పాత్ర‌కీ అంతే ప్రాధాన్యం ఉంటుంద‌ని అనుకుంటున్నారు.

అంతేకాకుండా ఇప్ప‌టికే చిత్ర‌బృందం అన‌సూయ కాల్షీట్లు కూడా తీసేసుకుంద‌ని తెలుస్తోంది. మరి గతంలో సోగ్గాడే చిన్నినాయనాలో నాగార్జునకి మరదలు పిల్లగా నటించిన అనసూయ ఇప్పుడు చిరంజీవి సినిమాలోనూ ఒక కీ రోల్ చెయ్యబోతుందన్నమాట.

Sponsored links

Anasuya in Megastar 152 Film:

Anasuya Key Role in Chiru and Koratala Film

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019