అలా అయితే శ్రద్దాశ్రీనాథ్‌ పేరు మోగడం ఖాయం!

Tue 23rd Apr 2019 04:00 PM
shraddha srinath,heroine,dil raju,naga chaitanya,movie  అలా అయితే శ్రద్దాశ్రీనాథ్‌ పేరు మోగడం ఖాయం!
Shraddha Srinath Enters Dil Raju Compound అలా అయితే శ్రద్దాశ్రీనాథ్‌ పేరు మోగడం ఖాయం!
Sponsored links

ప్రస్తుతం నేచురల్‌స్టార్‌ నాని -శ్రద్దాశ్రీనాధ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ అద్భుత కలెక్షన్లతో దూసుకునిపోతోంది. సామాన్యుల నుంచి బి, సి సెంటర్ల ప్రేక్షకులే కాదు.. ‘ఎ’ క్లాస్‌ ఆడియన్స్‌, విశ్లేషకులు, విమర్శకులు, సోషల్‌మీడియా, వెబ్‌సైట్స్‌ అన్ని ‘జెర్సీ’ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇంత గొప్ప చిత్రాన్ని చూసి చాలా కాలం అయిందని అందరు ముక్తకంఠంతో చెబుతున్నారు. రోజు రోజుకి ఈ చిత్రం కలెక్షన్లు అద్భుతంగా పెరుగుతున్నాయి. త్వరలో స్క్రీన్ల సంఖ్యను పెంచే ఆలోచన చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఫీల్‌గుడ్‌తో ఎంతో ఎమోషన్‌ బాండింగ్‌తో సాగే చిత్రం. ఇలాంటి చిత్రాలను ఓవర్‌సీస్‌ ప్రేక్షకులు మెచ్చరని, ‘మజిలీ’ ని కూడా అదే కారణంగా పెద్దగా ఆదరించలేదని ముందుగా విశ్లేషకులు అన్నారు. ఓవర్‌సీస్‌ ఆడియన్స్‌ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కే పెద్దపీట వేస్తారని ఊహించారు. 

ఇక ‘జెర్సీ’ చిత్రం ఓవర్‌సీస్‌లో కూడా అద్భుతంగా పుంజుకుంది. నాని కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిన ‘భలే భలే మగాడివోయ్‌’ని అతి తక్కువ కాలంలోనే ‘జెర్సీ’ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నాని, శ్రద్దాశ్రీనాథ్‌ల నటనకు, గౌతమ్‌ తిన్ననూరి, అనిరుధ్‌ రవిచంద్రన్‌ల సంగీతానికి బోల్డ్‌ కాని వారు లేరు. ఇక శ్రద్దాశ్రీనాథ్‌ రూపేణ తెలుగు ఇండస్ట్రీకి మరో టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌ లభించింది. కన్నడలో ‘యూటర్న్‌’, తమిళంలో నాన్‌-బాహుబలి రికార్డుగా చెప్పుకుంటున్న ‘విక్రమ్‌ వేదా’లో మాధవన్‌ భార్యగా ఈమె చూపిన నటన నేడు ‘జెర్సీ’తో మనల్ని కూడా హృదయాలను టచ్‌ చేస్తోంది. దీంతో గౌతమ్‌ తిన్ననూరితో పాటు శ్రద్దాకి కూడా తెలుగులో మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. 

ఇక విషయానికి వస్తే త్వరలో శ్రద్దాశ్రీనాథ్‌, నాగచైతన్య సరసన నటించే అవకాశాలు ఉన్నాయట. నాగచైతన్య గత కొంతకాలంగా గీతాఆర్ట్స్‌ బేనర్‌లో ఓ చిత్రం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండటంతో చైతు దిల్‌రాజు బేనర్‌లో ఓ చిత్రం చేయడానికి ఓకే చెప్పాడట. చైతు తెరంగేట్రం మూవీ జోష్‌ ని కూడా దిల్‌రాజే నిర్మించాడు. ఈ చిత్రం సరిగా ఆడలేదు. నాటి నుంచి మరలా చైతు, దిల్‌రాజుతో చిత్రం చేయలేదు. అది ఇంతకాలానికి నిజం కానుంది. ఇటీవలే శశి అనే నూతన దర్శకుడు దిల్‌రాజుకి చెప్పిన స్టోరీ నచ్చడంతో ఆయన ఓకే చేశాడని సమాచారం. ఇందులో నాగచైతన్య, శ్రద్దాశ్రీనాథ్‌లు నటించే అవకాశం ఉంది. దిల్‌రాజు బేనర్‌లో శ్రద్దాకి చాన్స్‌ రావడం, అది ఇంత త్వరగా అంటే అది అదృష్టమే. ఎందుకంటే తన చిత్రాలలో నటించే హీరోయిన్లను దిల్‌రాజు రిపీట్‌ చేస్తూ ఉంటాడు. అలా వారికి స్టార్‌స్టేటస్‌ వచ్చేలా చేస్తాడు. సో.. త్వరలోనే శ్రద్దాశ్రీనాథ్‌ కూడా టాప్‌లీగ్‌లోకి అడుగుపెట్టడం గ్యారంటీ అనే చెప్పాలి.

Sponsored links

Shraddha Srinath Enters Dil Raju Compound:

Shraddha Srinath in Dil Raju and Naga Chaitanya Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019