మాస్, క్లాస్‌లలో విజయం ఎవరిదంటే..?

Sun 21st Apr 2019 07:07 PM
hero nani,raghava lawrence,jersey,beats,kanchana 3,box office  మాస్, క్లాస్‌లలో విజయం ఎవరిదంటే..?
Jersey Beats Kanchana 3 at Box Office మాస్, క్లాస్‌లలో విజయం ఎవరిదంటే..?
Sponsored links

నిన్న శుక్రవారం ఒక క్లాస్ సినిమా మరొకటి మాస్ సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీపడ్డాయి. ఒకటి తెలుగు స్ట్రయిట్ మూవీ, మరొకటి డబ్బింగ్ సినిమా. ఇక క్లాస్ సినిమాగా నాని జెర్సీ సినిమా ఉంటే.. మాస్ సినిమాగా రాఘవ లారెన్స్ కాంచన 3 సినిమా ఉంది. నాని - శ్రద్ద శ్రీనాధ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్  నిర్మాణములో తెరకెక్కిన జెర్సీ నిన్న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో హడావిడి చేస్తుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వానికి, కథ, కథనానికి, నాని నటనకు, శ్రద్ద శ్రీనాధ్ నటనకు, అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి, జెర్సీ సినిమాటోగ్రఫీకి, జెర్సీ లోని సంభాషణలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. కాస్త నిడివి ఇబ్బంది పెట్టిన... అక్కడక్కడా లాగింగ్ సీన్స్ ఉన్నప్పటికీ.. అన్ని పాజిటివ్ పాయింట్స్ మధ్య ఆ లోపాలు పెద్దగా కనిపించలేదు. అలా జెర్సీ క్లాస్ ఆడియన్స్ ని మెప్పించింది.

మరి మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రాఘవ లారెన్స్ హీరోగా నటించి, డైరెక్షన్ చేసిన కాంచన 3 సినిమా కూడా నిన్నశుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో తెరకెక్కిన కాంచన 3 సినిమాని తెలుగులోనూ డబ్ చేసి తమిళంతో పాటుగా విడుదల చేసాడు లారెన్స్. తెలుగులోనూ లారెన్స్ కి మంచి మార్కెట్ ఉండడంతో కాంచన 3 కి ఇక్కడ భారీ బిజినెస్ కూడా జరిగింది. కానీ కాంచన 3 మాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. రాఘవ నటన బావున్నప్పటికీ... కాంచన 3 రొటీన్ మూవీగా మిగిలిపోయింది. ప్రేక్షకులను దెయ్యంతో భయపెడదామని రాఘవ అనుకుంటే.. ప్రేక్షకులు కాంచన 3 చూసి భయంతో కాదు... ఆ రొటీన్ సినిమా చూడలేక భయపడి పారిపోయారు. రివ్యూ రైటర్స్ కూడా కాంచన 3 ని ఉతికి ఆరేశారు. కాంచన, గంగ రేంజ్ లో కాంచన 3 లేకపోవడమే కాదు.. కాంచన 3 రొటీన్ మాస్ మసాలాలా ఉండడంతో ఆ సినిమాకి నెగెటివ్ టాక్ పడింది. మరి ఆ విధంగా మాస్ మూవీ కాంచన 3 మీద క్లాస్ మూవీ జెర్సీ గెలిచినట్లేగా..! 

Sponsored links

Jersey Beats Kanchana 3 at Box Office:

Jersey vs Kanchana 3.. The winner is..

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019