Advertisementt

సుకుమార్ కథ చివరకి ఎక్కడికి చేరేను?

Sat 20th Apr 2019 03:15 PM
sukumar,allu arjun,mahesh babu,story,sukku,story problem,sukumar confusion  సుకుమార్ కథ చివరకి ఎక్కడికి చేరేను?
Sukumar in Confusion Mode సుకుమార్ కథ చివరకి ఎక్కడికి చేరేను?
Advertisement
Ads by CJ

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ ఇంకా తన తదుపరి చిత్రం ఏంటో ఫైనల్ చేయలేదు. కారణం స్టోరీ రెడీ చేయడం లేట్ అవుతుంది. మొన్నటివరకు మహేష్ తో సినిమా చేద్దాం అని డే అండ్ నైట్ కష్టపడి స్టోరీ డెవెలప్ చేస్తున్న టైములో మహేష్.. సుకుమార్ ని కాదని అనిల్ రావిపూడి కి ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ మహేష్.. అనిల్ తో సినిమా చేయడానికి కారణం ఒకటి ఉంది. బన్నీ తో తనకు తెలియకుండా సుకుమార్ సినిమా ఓకే చేయించుకోవడం.

దాంతో మహేష్ ఇంకా సుకుమార్ తో సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యాడు. కానీ సుకుమార్ వెళ్లి మళ్లీ మహేష్‌ని ప్రసన్నం చేసుకున్నాడు. ఇటు బన్నీ కూడా సుకుమార్ కథ రెడీ చేస్తున్నాడు కదా అని అతడికి సరిపడా సమయం ఇవ్వకుండా ‘ఐకాన్‌’ అనే మరో సినిమా అనౌన్స్‌ చేసాడు. వేణు శ్రీరామ్ వద్ద కథ రెడీ గా ఉండడంతో బన్నీ.. త్రివిక్రమ్ తరువాత ఐకాన్ మూవీ చేయనున్నాడు.

బాలీవుడ్‌, హాలీవుడ్‌లో కథ కోసమే ఎన్ని ఏళ్లయినా హీరోలు వేచి చూస్తుంటారు. కానీ టాలీవుడ్ లో పరిస్థితులు వేరు. కథ ఏమన్నా తేడా కొట్టిన డైరెక్టర్ నే బ్లేమ్ చేస్తారు. ఇక్కడ డైరెక్టర్స్ కోసం హీరోలు ఆగరు. హీరోల కోసమే డైరెక్టర్స్ ఆగాలి. సో సుకుమార్ సినిమా ఇప్పటిలో లేనట్టే. సుకుమార్ కూడా స్టోరీ ని చాలా స్లో గా రెడీ చేస్తుంటాడు. అందుకే తన సినిమాలు అంత లేట్ అవ్వడానికి కారణం.

Sukumar in Confusion Mode:

What is the Reason behind Sukumar movie late?

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ