నానికి డొంకతిరుగుడు ఇష్టం లేదా....?

Fri 19th Apr 2019 06:41 PM
nani,gang leader,title,no compromise  నానికి డొంకతిరుగుడు ఇష్టం లేదా....?
Nani about gang leader title నానికి డొంకతిరుగుడు ఇష్టం లేదా....?
Sponsored links

తెలుగులో ఉన్న హీరోలలో మంచి టాలెంట్‌తో పాటు వివాదరహితునిగా నేచురల్‌స్టార్‌ నానికి పేరుంది. ఆయనను మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌, కింగ్‌ నాగార్జున వంటి వారు ఎంతో గౌరవిస్తారు. అయితే మరికొన్ని గంటల్లో నాని తెలుగులో క్రికెట్‌ నేపధ్యంలో సాగే ఫిక్షన్‌ స్టోరీతో 'జెర్సీ' విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా మంచి హిట్‌ కొట్టి 'కృష్ణార్జునయుద్దం, దేవదాస్‌'ల తర్వాత మరలా బౌన్స్‌ బ్యాక్‌ అవుతానని ఆయన కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. మరోవైపు ఆయన వైవిధ్యభరిత చిత్రాలు దర్శకుడు, ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో 'గ్యాంగ్‌లీడర్‌', దిల్‌రాజు నిర్మాణంలో తాను కూడా భాగస్వామిగా సుధీర్‌బాబుతో కలిసి 'వ్యూహం' చిత్రాలలో నటించేందుకు ఒప్పుకున్నాడు. 

తాజాగా 'జెర్సీ' వేడుకల్లో నాని విక్టరీ వెంకీతో కలిసి నటించమని పలువురు అడుగుతున్నారని తన ఆకాంక్షను బయటపెట్టాడు. బహుశా అది 'ఎఫ్‌ 3'లోనే అయి ఉంటుందని, ఇంతకు ముందు రవితేజ నటిస్తాడని ప్రచారం జరిగిన పాత్రలో నాని నటించే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. మరోవైపు నాని 'వాల్‌పోస్టర్‌' బేనర్‌ని స్థాపించి ఎంతో వినూత్నమైన 'అ' చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో నిర్మించి అభిరుచి కలిగిన నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయనకు ఆస్ట్రేలియాకి చెందిన ఓ ఎన్నారై చెప్పిన స్క్రిప్ట్‌, నేరేషన్స్‌ బాగా నచ్చాయట. థ్రిల్లర్‌ జోనర్‌లో సాగే ఈ కథకి సరైన హీరో కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. మరోవైపు నాని తాను విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నటించే చిత్రానికి చిరంజీవి బ్లాక్‌బస్టర్‌, మాస్టర్‌పీస్‌, మాస్‌ హీరోయిజాన్ని కేరాఫ్‌ అడ్రస్‌గా, 'అడవిరాముడు' తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న 'గ్యాంగ్‌లీడర్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశాడు. ఈ టైటిల్‌ని వాడుకుంటే తమ మెగా వారసులే వాడుకోవాలని, అంతేగానీ నాని వాడుకోవడం ఏమిటని? పలువురు మెగాభిమానులు మండిపడుతున్నారు. 

అయితే ఈ నేపధ్యంలో ఈ చిత్రం టైటిల్‌ గురించి నాని మాట్లాడుతూ, నేను గ్యాంగ్‌లీడర్‌ చిత్రానికి ఎంతో వీరాభిమానిని, విక్రమ్‌ కెకుమర్‌ చెప్పిన కథకు గ్యాంగ్‌లీడర్‌ కథకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చిత్రం చూసిన ఎవరైనా సరే ఈ చిత్రానికి 'గ్యాంగ్‌లీడర్‌' అంటేనే పర్‌ఫెక్ట్‌ అని ఒప్పుకుంటారు అని చెప్పుకొచ్చాడు. మరోచిన్న నిర్మాత ఇదే టైటిల్‌ని తాను రిజిష్టర్‌ చేయించానని అంటున్నాడు. గతంలో ఇలాంటి వివాదాలే వచ్చినప్పుడు మహేష్‌ 'మహేష్‌ ఖలేజా' అని, కళ్యాణ్‌రామ్‌ 'కళ్యాణ్‌రామ్‌ కత్తి' అనే తమ పేర్లను ముందుపెట్టి కత్తి అనే టైటిల్స్‌ని వాడుకున్నారు. కానీ నాని మాత్రం ఈ టైటిల్‌ కాదు అంటే మరో టైటిల్‌ చూసుకుంటానని చెబుతున్నాడు. అంటే బహుశా నానికి అలా దొడ్డిదారిన వెళ్లడం ఇష్టం లేదేమో మరి....! 

Sponsored links

Nani about gang leader title:

I am Gang Leader, no compromise says nani

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019