విజయ్ 63 రికార్డులు మొదలైనాయ్!

Thu 18th Apr 2019 04:28 PM
vijay,vijay 63,atlee,overseas business,records  విజయ్ 63 రికార్డులు మొదలైనాయ్!
Vijay 63 film Business Creates Records విజయ్ 63 రికార్డులు మొదలైనాయ్!
Sponsored links

అట్లీ - విజయ్ కాంబోలో తెరకెక్కిన తేరి బ్లాక్ బస్టర్ హిట్. అయితే మెర్సల్ మాత్రం యావరేజ్ సినిమా అయినా.. విజయ్ క్రేజ్ తో అట్లీ - విజయ్ కాంబో మీదున్న అంచనాలతో మెర్సల్ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ తో అదరగొట్టింది. అందుకే మరోసారి ఆ కాంబో మొదలవుతుంది అనగానే ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. విజయ్ 63 గా మొదలైన ఈ సినిమాపై అప్పుడే ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాలో విజయ్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార నటించడంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. సినిమా మొదలైన కొద్దీ రోజులకే... ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో మొదలైంది. ఇక 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ రికార్డు స్థాయిలో 50 కోట్లకు అమ్ముడుపోయాయి.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. అయితే తాజాగా ఓవర్సీస్ హక్కుల విషయంలోనూ విజయ్ - అట్లీ ల కాంబో రికార్డు ధర పలికిందని సమాచారం. విజయ్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. అందులోను రెండు సినిమాల బ్లాక్ బస్టర్ తో ఉన్న ఈ క్రేజీ కాంబో సినిమాకి ఇప్పుడు ఓవర్సీస్ లో భారీ ధర పలుకుతుందని... అందుకే విజయ్ నిర్మాతలు ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ వారు 30 కోట్లు కోడ్ చేసారని చెబుతున్నారు. అయితే ఆ 30 కోట్లు ఇవ్వడానికి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ సిద్దమవుతున్నారనే టాక్ వస్తుంది. మరి సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే ఈ రేంజ్ బిజినెస్ మొదలైంది అంటే.. ఆ షూటింగ్ కూడా పూర్తయితే.. సినిమా మీది మరెంత క్రేజ్ పెరుగం ఖాయం అంటున్నారు. ఇక త్వరలోనే విజయ్ - అట్లీ సినిమా భారీ షెడ్యూల్ మొదలు కాబోతుంది.

Sponsored links

Vijay 63 film Business Creates Records:

30 Crore overseas business to Vijay 63 film

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019