పవన్ కల్యాణ్‌కు నచ్చిన ‘చిత్రలహరి’

Thu 18th Apr 2019 11:53 AM
pawan kalyan,chitralahari,sai dharam tej,power star,pawan kalyan gift  పవన్ కల్యాణ్‌కు నచ్చిన ‘చిత్రలహరి’
Pawan Kalyan Praises Chitralahari Team పవన్ కల్యాణ్‌కు నచ్చిన ‘చిత్రలహరి’
Sponsored links

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మించిన చిత్రం ‘చిత్ర‌ల‌హ‌రి’. ఏప్రిల్ 12న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌హిట్ టాక్‌తో విమ‌ర్శ‌కుల, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినిమా చూసిన వారందరూ యూనిట్‌ను అప్రిషియేట్ చేశారు. 

ఇటీవ‌ల సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. సాయితేజ్‌, నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడ్ని అభినందిస్తూ ఓ వీడియో సందేశం పంపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సినిమాను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చూశారు. ఆయ‌న‌కు సినిమా బాగా న‌చ్చ‌డంతో యూనిట్‌ను అభినందిస్తూ చిత్ర యూనిట్‌కు ఫ్ల‌వ‌ర్ బొకెల‌ను పంపారు. ‘కంగ్రాట్స్ .. మీ వ‌ర్క్‌ను నేను ఎంతో బాగా ఎంజాయ్ చేశాను’ అంటూ మెసేజ్ కూడా పంపారు పవ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

Sponsored links

Pawan Kalyan Praises Chitralahari Team:

Pawan Kalyan Watches Chitralahari Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019