Advertisementt

మోదీ మాటను లెక్కచేయని నాగ్‌!

Wed 17th Apr 2019 12:26 PM
nagarjuna,no respect,pm modi,vote  మోదీ మాటను లెక్కచేయని నాగ్‌!
Nagarjuna Did Not Cast His Vote మోదీ మాటను లెక్కచేయని నాగ్‌!
Advertisement

తెలుగు స్టార్స్‌లో ‘లోక్‌సత్తా... మీ సత్తా’ అని చెప్పినా, ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రకటనలు ఇచ్చినా, ప్రతి ఎన్నికల ముందు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పడంలో నాగ్‌ ముందుంటాడు. అది ఇప్పుడు మొదలుపెట్టింది కాదు.. ఎన్నో ఏళ్ల కిందటే ఈ విషయంలో నాగార్జున ఎంతో బాధ్యతాయుతమైన సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్నాడు. బహుశా అందుకే కాబోలు ఈ ఎన్నికల్లో ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం తేవాల్సిన బాధ్యతను మోదీ అప్పగించిన సెలబ్రిటీలలో నాగార్జునకి కూడా చోటు దక్కింది. 

ఇక తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు గతంలో ఎన్నో ఎన్నికలతో పోలిస్తే విభిన్నమైనవి. ఈవీఎంలు సరిగా పనిచేయని పరిస్థితుల్లో కూడా సామాన్యులు అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్దులు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎంతో ఉత్సాహం చూపించారు. అందుకే ఎన్నడు లేని విధంగా పోలింగ్‌ దాదాపు 80శాతం జరిగింది. తమ విధిలో భాగంగా చిరంజీవి నుంచి చిన్న చితకా సెలబ్రిటీలు కూడా తాము ఓటు వేసి సామాన్యులను, అభిమానులను ఓటు వేయాల్సిందిగా స్ఫూర్తినిచ్చారు. 

ఇక నాగచైతన్య, సమంతలు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజానిక పెద్దగా ఆర్ధికస్థోమత లేని వారు కూడా తమ తమ ఊర్లకు బస్సులలో, రైళ్లలో ప్రయాణ ఖర్చులు కూడా లెక్కచేయకుండా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక విదేశాలలోని ఎన్నారైలు కూడా లక్షలు ఖర్చుపెట్టి విదేశాల నుంచి తమ స్వంత గ్రామాలకు వచ్చి ఓటు వేశారు. కానీ నాగార్జున మాత్రం కనిపించలేదు. ఈ విషయంలో ఆయనది బాధ్యతారాహిత్యమేనని చెప్పాలి. ఆయన ‘మన్మథుడు 2’ షూటింగ్‌ నిమిత్తం పోర్చుగల్‌లో ఉన్నాడని తెలుస్తోంది. బహుశా అంత దూరం నుంచి వచ్చి ఓటేయడం ఎందుకు అని ఆయన భావించి ఉంటాడు. 

కానీ ఆర్ధికంగా, సెలబ్రిటీగా, మోదీ ఏరికోరి ఇచ్చిన బాధ్యతకు నాగ్‌ న్యాయం చేయలేదనే చెప్పాలి. గతకొంత కాలంగా నాగ్‌ వైసీపీకి మద్దతు ఇస్తున్నాడని ప్రచారం జరిగింది. పార్టీ ఏదైనా సరే ఆయన కనీసం తన ఓటు హక్కును వినియోగించుకుని ఓ బాధ్యతాయుతమైన సెలట్రిటీగా తన విధికి న్యాయం చేయలేదనే చెప్పాలి. దీనికి ఎన్ని కుంటిసాకులు చెప్పినా ఆయన చేసినది ముమ్మాటికి తప్పేనని చెప్పాలి. తరుచు బాధ్యతల గురించి లెక్చర్స్‌ దంచే నాగార్జున ఈ విషయంలో పెద్ద తప్పుని చేసి తన పెద్దరికాన్ని కోల్పోయాడనే చెప్పాలి. 

Nagarjuna Did Not Cast His Vote:

Nagarjuna Has No Respect For PM!  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement