‘చిత్రలహరి’ ప్రతి ఒక్కరూ చూడాలి: చిరు

Mon 15th Apr 2019 10:46 PM
megastar chiranjeevi,greetings,chitralahari team  ‘చిత్రలహరి’ ప్రతి ఒక్కరూ చూడాలి: చిరు
Chiranjeevi supports to Chitralahari ‘చిత్రలహరి’ ప్రతి ఒక్కరూ చూడాలి: చిరు
Sponsored links

‘చిత్ర‌ల‌హ‌రి’ ప్ర‌తి ఒక్క‌రూ చూడ‌ద‌గ్గ చిత్రం - మెగాస్టార్ చిరంజీవి

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మించిన చిత్రం ‘చిత్ర‌ల‌హ‌రి’. ఏప్రిల్ 12న విడుద‌లై సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సంద‌ర్భంగా ..

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ‘‘కిషోర్ తిరుమ‌ల ‘చిత్ర‌ల‌హ‌రి’ చిత్రాన్ని సెటిల్డ్ మెసేజ్‌తో చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభను నిరూపించుకున్నారు. ఇక తేజు కూడా న‌టుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నాడు. మెచ్యూర్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో చాలా చ‌క్క‌గా న‌టించాడు. ప‌రిణితిని సాధించిన న‌టుడిగా నిరూపించుకున్నాడు. పోసాని కృష్ణ‌ముర‌ళి, సునీల్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించి నిండుద‌నం తెచ్చారు. దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. స‌క్సెస్‌ఫుల్ సినిమాల‌కు మైత్రీ మూవీస్ సంస్థ అడ్ర‌స్‌గా నిలుస్తుంది. వారి ప్ర‌తిష్ట‌ను మ‌రింత నిల‌బెట్టుకునే ఈ సినిమాను రూపొందించారు.

బంధాలు, అనుబంధాలు గురించి ముఖ్యంగా తండ్రి కొడుకు మ‌ధ్య అనుబంధం గురించి చ‌క్క‌గా చెప్పారు. ఎలాంటి ఒడుదొడుకులు వ‌చ్చినా మ‌నం అనుకున్న ల‌క్ష్యం సాధించ‌డానికి కృషితో ముందుకు వెళ్లాల‌ని చెప్పిన చిత్రం ‘చిత్ర‌ల‌హ‌రి’. ఈ వేస‌వికి విడుద‌లైన చిత్ర‌ల‌హ‌రి ప్ర‌తి ఒక్క‌రూ చూడ‌ద‌గ్గ చిత్రం.  సినిమా స‌క్సెస్ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్ష‌లు’’ అన్నారు.

Sponsored links

Chiranjeevi supports to Chitralahari:

Megastar greetings to chitralahari team

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019