యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పేరుకే రికార్డ్!

Sun 14th Apr 2019 03:49 PM
prabhas,record,entry,instagram  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పేరుకే రికార్డ్!
Prabhas Record Entry Into the Instagram యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పేరుకే రికార్డ్!
Sponsored links

ఇన్ స్టాగ్రామ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రికార్డ్ ఎంట్రీ

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. ఇక ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫాంలోకి ప్రభాస్ అధికారికంగా ఎకౌంట్ ఓపెన్ చేశాడు. ఎకౌంట్ ఓపెన్ చేశాడో లేదో 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ చేరడం రికార్డు. ఓ సౌంత్ ఇండియన్ స్టార్ కి ఇన్ స్టా గ్రామ్ లో ఇదే రికార్డు. ప్రభాస్ అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ కి పది మిలియన్స్ లైక్స్ ఉండడం విశేషం. 

ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ లో విడుదలౌతున్న ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే సాహో పార్ట్ 1, సాహో పార్ట్ 2 టీజర్స్ తో సంచలనం సృష్టించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మేకింగ్ తో భారీగా అంచనాలు పెంచేశారు.  బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్లో హై టెక్నికల్ వ్యాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్ట్ ను ప్రభాస్ తన అఫీషియల్ ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేయనున్నారు. 

Sponsored links

Prabhas Record Entry Into the Instagram:

Prabhas Rare Feat On Debut

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019