చిత్రలహరిలో సునీల్‌‌దేం లేదు

Sun 14th Apr 2019 01:17 PM
sunil,comeian,chitralahari movie,sai dharam tej,no importance  చిత్రలహరిలో సునీల్‌‌దేం లేదు
Sunil Role in Chitralahari Film చిత్రలహరిలో సునీల్‌‌దేం లేదు
Sponsored links

సునీల్ హీరోగానే కాదు.. కమెడియన్ గా కూడా వరసగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. కమెడియన్ గా మాంచి ఫామ్ లో ఉన్న సునీల్ కి హీరో క్యారెక్టర్స్ ఇచ్చి దర్శకులు తప్పు చేశారు. దర్శకులు నువ్వు హీరోవయ్యా అంటే... సునీల్ కూడా ఉబ్బిపోయి దొరికిన సినిమాలల్లా చేసి చేతులు కాల్చుకున్నాడు. హీరోగా రెండు సినిమాలు మాత్రమే అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. మిగతావన్నీ డిజాస్టర్ మూవీస్. ఇక హీరోగా ఫెడవుట్ అయిన సునీల్ కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు కమెడియన్ గా బ్రహ్మి లేని లోటు పూడుస్తాడనుకుంటే.. సునీల్ ని కమెడియన్ గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దర్శకులు కూడా సునీల్ కి పేలవమైన కామెడీ ట్రాక్ పెడుతున్నారు.

త్రివిక్రమ్ అయితే కమెడియన్ గా కాకుండా అరవింద సమేతలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్ర ఇచ్చాడు. నీలాంబరిగా ఆ పాత్ర సునీల్ కి ఎలాంటి హెల్ప్ కాలేదు. ఇక పడి పడి లేచె మనసులో బంతిలా బండగా తయారై ప్రేక్షకులకు కామెడీ పుట్టిద్దామన్నా.. సునీల్ వల్ల కాలేదు. తాజాగా చిత్రలహరితో సునీల్ మళ్ళీ ఫామ్ లోకొచ్చేస్తాడని... చిత్రలహరి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు అన్నారు. కానీ చిత్రలహరిలో సునీల్  ఫన్ లో స్పార్క్ లేదు. పేలవమైన కామెడీతో మరీ లావుగా ఎబ్బెట్టుగా కనిపించాడు.

గ్లాస్ మేట్స్ సాంగ్ లో కాస్త హడావిడి చేసిన సునీల్ కి చిత్రలహరిలో ఓ అన్నంత కామెడీ పాత్ర మాత్రం దక్కలేదు. మరి ఇలా కమెడియన్ గా కూడా వరుస ఫెయిల్యూర్స్ సునీల్ కెరీర్ కి దెబ్బె అనిపిస్తుంది. ప్రస్తుతం సునీల్ ఆశలన్నీ బన్నీ - త్రివిక్రమ్ సినిమా మీదే. మరి స్నేహితుడికి త్రివిక్రమ్ మరోసారి లైఫ్ ఇస్తాడో లేదో చూద్దాం.

Sponsored links

Sunil Role in Chitralahari Film:

No Importance to Sunil Role in Chitralahari

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019